Share News

Rama Naidu:సహాయక చర్యల్లో వేగం పెంచాలి.. మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు

ABN , Publish Date - Sep 01 , 2024 | 08:46 PM

ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయి సహాయక చర్యలు ముమ్మరం చేసింది. విజయవాడలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధింత అధికారులతో సమావేశం అయ్యారు.

Rama Naidu:సహాయక చర్యల్లో వేగం పెంచాలి.. మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు
Nimmala Rama Naidu

అమరావతి: ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయి సహాయక చర్యలు ముమ్మరం చేసింది. విజయవాడలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధింత అధికారులతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.


సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్‎తో కలసి నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పరిశీలించారు. కొండపల్లి దగ్గర బుడమేరుకి గండ్లు పడిన ప్రాంతాలను , చీకట్లో సైతం పరిశీలించి, గండ్లు పడిన ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


రాత్రి జనరేటర్లు ఏర్పాటు చేసుకుని యుద్ధ ప్రాతిపదికన అప్రోచ్ రహదారులు నిర్మించుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. నష్ట నివారణను అంచనా వేసి, ఎంత వ్యయం అయినా వెనుకడుగు వేయకుండా అక్కడికక్కడే ఏజెన్సీ‎కి పనులు అప్పగించారు. విజయవాడకు వరద ముంపును దృష్టిలో ఉంచుకుని రాత్రి పూట గండ్లు పడిన ప్రాంతంలోనే ఉండి స్వయంగా పనులు పర్యవేక్షిస్తాననిమంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కష్టమైనా అధికారులు, ఏజన్సీ ఇక్కడే ఉండి గండ్లు పూడ్చే పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.

Updated Date - Sep 01 , 2024 | 08:47 PM