Home » Rains
భారీ వర్షాలు పడినప్పుడు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) నగరవాసులను కోరారు. పిల్లలు, వృద్ధులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైకి రాకుండా కుటుంబసభ్యులు చూసుకోవాలన్నారు.
వాతావరణ కేంద్రం అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. మరో 2 గంటల్లో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ప్రకటన జారీ చేశారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, మాదాపూర్, జూబ్లీహిల్స్, సైనిక్ పురి, గాజుల రామారం, అల్వాల్, దిల్సుఖ్నగర్ సహా తదితర ప్రాంతాల్లో దంచికొడుతోంది.
తెలుగు రాష్ట్రాల వరద బాధితులను ఆదుకునేందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందుకొచ్చారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన రూ.50లక్షల చెక్కును అందజేశారు. అలాగే ఏఎంబీ మాల్ తరఫున మరో రూ.10లక్షలు అందజేశారు.
తెలంగాణలో సోమ, మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒకటి రెండు మినహా అన్ని జిల్లాల్లో వానలు పడే అవకాశముందని పేర్కొంది.
హైదరాబాద్‌లో సోమ, మంగళ, బుధవారాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. నగరంలోని పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ..
దేశవ్యాప్తంగా నేటితోపాటు వచ్చే మూడురోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాలు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాది వరకు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఏయే ప్రాంతాల్లో వానలు ఉన్నాయో తెలుసుకుందాం.
భాగ్యనగరంలో భారీ వర్షం పడుతోంది. నగరంలో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది.
ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వాయవ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇటీవల ఓ నాలుగు రోజులు నాన్‌స్టాప్‌గా కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. ఆ వర్షం పోయి.. పది రోజుల పాటు ఎండలు వచ్చాయి. దీంతో జనాలంతా హమ్మయ్య అనుకున్నారు. కానీ, ఇంతలోనే షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేసింది.