Home » Rajahmundry Central Jail
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖత్ పెంపు పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ ఉన్నందున రోజుకు మూడు సార్లు ములాఖత్ పెంచాలని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు (శుక్రవారం) ఏసీబీ కోర్టులో విచారణకు రాగా.. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition ) మంగళవారం నాడు సుప్రీంకోర్టులో సుదీర్ఘం విచారణ జరిగిన సంగతి తెలిసిందే..
రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు అధికారులు కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించారు. చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ అధికారులు వింత సాకులు చెపుతున్నారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బాబును అధికారుల, ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదని.. అందుకే ఆయన అనారోగ్యానికి గురవుతున్నారని బాబు కుటుంబం కంగారు పడుతోంది...
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(Skill Development Case)లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి జైలులో ఉన్న బాబు ఆరోగ్యంపై ఆందోళనలూ కొనసాగుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నా.. అధికారులు నిరాకరిస్తున్నారు.
డాక్టర్ల బృందం చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. చంద్రబాబు పారామీటర్స్ నార్మల్‌గా ఉన్నాయని వైద్యులు తెలిపారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు (Nara Chandrababu Naidu) మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ ఆయన లాయర్లు దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) విచారణ చేపట్టింది.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఆరోగ్య పరిస్థితిపై కోర్టును ఆశ్రయించాలని టీడీపీ (TDP) నిర్ణయం తీసుకుంది.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ (DIG) రవి కిరణ్‌ను టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ప్రశ్నించారు.