ACB Court: చంద్రబాబు పిటిషన్ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
ABN , First Publish Date - 2023-10-14T20:44:41+05:30 IST
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు (Nara Chandrababu Naidu) మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ ఆయన లాయర్లు దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) విచారణ చేపట్టింది.
విజయవాడ: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు (Nara Chandrababu Naidu) మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ ఆయన లాయర్లు దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) విచారణ చేపట్టింది. రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీపీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు అనారోగ్య రిత్యా ఏసీ కల్పించాలని చంద్రబాబు తరపున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ చేశారు. ఆన్‌లైన్ ద్వారా విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. అత్యవసరంగా ఏసీ సౌకర్యం కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు.
చంద్రబాబుకు వైద్యులు ఇచ్చిన నివేదికను పరిశీలించాలని కోర్టును న్యాయవాదులు కోరారు. ఆయనకు చల్లని వాతావరణ పరిస్థితులు కల్పించాలని పిటిషన్‌లో న్యాయవాదులు పేర్కొన్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని కూడా ఏసీబీ కోర్టుకు చంద్రబాబు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.