Home » Rajastan Royals
పార్టీ స్థాపించి అతితక్కువ కాలంలోనే ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది ఆప్. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సంబంధించిన కేసులో తిహార్ జైల్లో ఉన్నారు. ఎన్నికలలో వినూత్నంగా ప్రచారం చేసి.. సక్సెస్ సాధించడంలో అరవింద్ కేజ్రీవాల్ ముందువరుసలో ఉంటారు. ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలోకి రావడానికి ఆయన ప్రచార వ్యూహం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రజలందరినీ ఆకర్షించేలా ప్రచారం చేయడంలో ఆయన ముందుంటారు.
రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ పిల్లర్‌లా నిలిచాడు. మంచి ఫామ్‌లో ఉన్న సంజు 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 16వ ఓవర్లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ వద్ద షై హోప్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ కూడా పరిశీలించారు. లైన్‌కు వెంట్రుక వాసిలో బంతిని అందుకున్నట్టు వీడియోలో కనిపించింది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad), రాజస్థాన్ రాయల్స్(rajasthan royals) జట్ల మధ్య నిన్న జరిగిన ఉత్కంఠ మ్యాచులో హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్(kavya maran) ఆనందంతో ఎగిరి గంతేశారు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 50వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలుకానుంది. అయితే చెన్నై, బెంగళూరు చేతిలో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని చూస్తోంది.
నేడు ఐపీఎల్ 2024లో 38వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటి స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ జట్టు ఆరో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో ఇప్పుడు చుద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ipl 2024) 27వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) చివరి ఓవర్లో ఉత్కంఠ విజయం సాధించింది. ఆ క్రమంలో పంజాబ్ ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింటా(Preity Zinta) స్టేడియంలో చేసిన రియాక్షన్ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.
నేడు ఐపీఎల్ 2024(IPL 2024)లో 27వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్ల మధ్య జరగనుంది. ప్రస్తుతం శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే నేడు జరిగే మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న జరిగిన RR vs RCB మ్యాచులో విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీ చేసినా కూడా RCB ఓటమి చెందింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సెల్ఫీష్ కోహ్లీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో విరాట్ బ్యాటింగ్ గురించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పందించారు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా కూడా royal challengers bangalore జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఈ సీజన్లో ఆర్సీబీ(RCB) నాలుగో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఈ మ్యాచులో ఆర్సీబీ ఓటమికి ప్రధానంగా గల కారణాలను ఇప్పుడు చుద్దాం.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.