Share News

IPL 2025 LIVE: హైదరాబాద్ సన్ రైజర్స్ ఘన విజయం..

ABN , First Publish Date - Mar 23 , 2025 | 12:54 PM

IPL 2025 Live Updates in Telugu: ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. అసలే ఆదివారం ఇవాళ డబుల్ ధమాకా.. తెలుగు క్రికెట్ అభిమానులకు ఓ రకంగా పండగని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ రాజస్థాన్‌తో ఆడనుంది. ఓవర్ టు ఓవర్ అప్‌డేట్స్ మీకోసం

IPL 2025 LIVE: హైదరాబాద్ సన్ రైజర్స్ ఘన విజయం..
IPL Live Updates

Live News & Update

  • 2025-03-23T19:34:09+05:30

    హైదరాబాద్ సన్ రైజర్స్ ఘన విజయం..

  • 2025-03-23T18:21:06+05:30

    ఉప్పల్ స్టేడియంలో హీరో వెంకటేష్ సందడి..

  • 2025-03-23T17:53:54+05:30

    రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్.

    • రియాన్ పరాగ్ దాస్ రెండో వికెట్‌గా పెవిలియన్ బాట పట్టాడు.

    • సిమర్‌జీత్ సింగ్ రనౌట్ చేశాడు.

  • 2025-03-23T17:53:42+05:30

    ఫస్ట్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్..

    • జైస్వాల్ ఔటయ్యాడు.

  • 2025-03-23T17:34:57+05:30

    ముగిసిన సన్ రైజర్స్ ఇన్నింగ్స్..

    • హైదరాబాద్ సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది.

    • మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు.

    • ఫోర్లు, సిక్సర్లతో ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్ విరుచుకుపడ్డారు.

    • నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేశారు.

    • ఆర్ఆర్ ముందు 287 పరుగుల భారీ స్కోర్‌ను లక్ష్యంగా పెట్టారు.

  • 2025-03-23T17:28:02+05:30

    వరుస వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్..

    • మాంచి ఊపుమీదున్న సన్ రైజర్స్ బిగ్ షాక్ తగిలింది.

    • వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది.

  • 2025-03-23T17:19:47+05:30

    ఆర్ఆర్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్న ఎస్ఆర్‌హెచ్..

    • ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు.

    • ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోతున్నాడు.

  • 2025-03-23T16:54:03+05:30

    నితీష్ రెడ్డి ఔట్..

    • నితీష్ రెడ్డి ఔటయ్యాడు.

    • 15 బంతుల్లో 30 పరుగులు చేశాడు.

    • 4 ఫోర్లు, 1 సిక్స్‌తో చెలరేగి ఆడాడు.

  • 2025-03-23T16:50:25+05:30

    ఊచకోత..

    • నితీష్, ఈషాన్ కిషన్ దుమ్మురేపుతున్నారు.

    • ఊచకోత అన్నట్లుగా వారిద్దరి బ్యాటింగ్ సాగుతోంది.

    • ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 70 పరుగులు చేశాడు.

    • ఇక నితీష్ 13 బంతుల్లో 26 పరుగులు చేశాడు.

  • 2025-03-23T16:25:33+05:30

    నితీష్ వచ్చేశాడు..

    • నితీష్ రెడ్డి క్రీజ్‌లోకి వచ్చాడు.

    • రావడం రావడంతోనే ఫోర్ బాదేశాడు.

  • 2025-03-23T16:25:00+05:30

    ట్రావిస్ హెడ్ ఔట్..

    • ట్రావిస్ హెడ్ ఔట్ అయ్యాడు.

    • 9వ ఓవర్ 3వ బంతికి హెడ్ క్యాచ్ ఔట్ అయ్యాడు.

    • హెడ్ 31 బంతుల్లో 67 పరుగులు చేశాడు.

    • 3 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు.

  • 2025-03-23T16:22:37+05:30

    ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేస్తున్నారు.

    • వచ్చిన ఏ బంతిని వదలకుండా బౌండరీకి పంపిస్తున్నారు.

    • ఫోర్లు, సిక్సర్లతో ఆర్ఆర్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

    • ఆట అంటే ఇదీ అనేలా దుమ్మురేపుతున్నారు.

    • ట్రావిస్ హెడ్ 29 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు.

    • ఇషాన్ కిషన్ కూడా తగ్గేదేలే అంటూ 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు.

  • 2025-03-23T15:47:28+05:30

    అభిషేక్ ఔట్..

    • ఎస్ఆర్‌హెచ్‌కు బిగ్ షాక్.

    • ఓపెనర్ అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు.

    • 10 బంతుల్లో 24 పరుగులు బాది దుమ్మురేపాడు.

  • 2025-03-23T15:45:25+05:30

    అన్నా.. ఏం కొట్టుడే ఇది.. ఫోర్లు, సిక్సులే..

    • సన్‌రైజర్స్ బ్యాటర్స్ దుమ్మురేపుతున్నారు.

    • అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ప్రత్యర్థి బౌలర్లకు ..పోయిస్తున్నారు.

    • బాల్ దొరికితే చాలు.. బౌండరీ దాటించేస్తున్నారు.

    • ఫోర్లు, సిక్సర్ల మోత మోగిస్తున్నారు.

  • 2025-03-23T15:39:04+05:30

    దూకుడుగా సన్ రైజర్స్.. తొలి ఓవర్‌లో 14 పరుగులు..

    • సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ స్టార్ట్ అయ్యింది.

    • ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్స్ మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నారు.

  • 2025-03-23T14:01:10+05:30

    ఉప్పల్‌లో బ్లాక్ టిక్కెట్ల దందా

    • ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా బ్లాక్ టిక్కెట్స్ దందా

    • బ్లాక్ టిక్కెట్స్ దందాపై రాచకొండ పోలీసుల ఉక్కుపాదం

    • శని, ఆదివారాల్లో 19 మంది అరెస్ట్

    • బ్లాక్‌లో అమ్ముతున్న సుమారు 45 టిక్కెట్స్ స్వాదీనం

    • శనివారం ముగ్గురు, ఆదివారం 16 మందిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు..

    • నలుగురి నుంచి 15 టిక్కెట్లును స్వాధీనం చేసుకున్న మహేశ్వరం SOT పోలీసులు

    • దేవేందర్ అగర్వాల్ వద్ద 2 టిక్కెట్స్, గుగులోతు రాకేష్ వద్ద 4 టిక్కెట్స్ , భానోత్ యాకుబ్ నాయక్ వద్ద 2 టిక్కెట్స్ స్వాధీనం

  • 2025-03-23T13:04:28+05:30

    టాస్ గెలిచేదెవరు

    • టాస్‌పై ఎవరి అంచనాలు వారివి

    • హోమ్ టీమ్ సన్ రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అంటూ గ్రోక్ అంచనా

    • మొదటి బ్యాటింగ్ జట్టు 170కి పైగా పరుగులు చేసే ఛాన్స్

  • 2025-03-23T13:04:27+05:30

    స్టేడియానికి రెండు జట్లు

    • ఉప్పల్ స్టేడియానికి హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు

    • సరిగ్గా 3 గంటలకు టాస్

    • 3.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్

    • స్టేడియానికి క్యూ కట్టిన ఫ్యాన్స్

    • ఉప్పల్ పరిసరాల్లో భారీ ట్రాఫిక్

  • 2025-03-23T13:04:26+05:30

    SRH అభిమానులకు గుడ్ న్యూస్

    • హైదరాబాద్‌లో వాతావరణంపై ఐఎండి కీలక అప్డేట్

    • ఆదివారం హైదరాబాద్ సిటీలో వర్షం కురిసే అవకాశం లేదన్న వాతావరణ శాఖ

    • నో రెయిన్ అనడంతో పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

  • 2025-03-23T12:54:13+05:30

    కాసేపట్లో హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్

    • ఉప్పల్ స్టేడియంలో SRH vs RR మ్యాచ్

    • గెలుపుపై రెండు జట్ల ధీమా

    • ప్లేయింగ్ 11 ఊహించని మార్పులు

    • ఇంపాక్ట్ ప్లేయర్‌గా ట్రావిస్ హెడ్

    • క్లాసెన్‌కు జట్టులో చోటు

    • జంపాా, ఉనద్కత్‌కు ప్లేయింగ్ 11లో ఛాన్స్

    • ఈషన్ మలింగ, మల్డర్‌కు నో ఛాన్స్