Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ ఏం చేయబోతున్నాడు? ఐపీఎల్‌లో ఏ ఫ్రాంఛైజీకి కోచ్‌గా వెళ్లబోతున్నాడు?
ABN , Publish Date - Jul 23 , 2024 | 12:17 PM
టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి కాలం పూర్తి కావడంతో ద్రవిడ్ మళ్లీ ఐపీఎల్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. చాలా ఫ్రాంఛైజీలు ద్రవిడ్‌ను మెంటార్‌గా లేదా హెడ్ కోచ్‌గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
టీమిండియా టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) గెలిచిన తర్వాత హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తప్పుకున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ (Head Coach) పదవి కాలం పూర్తి కావడంతో ద్రవిడ్ మళ్లీ ఐపీఎల్ (IPL)లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. చాలా ఫ్రాంఛైజీలు ద్రవిడ్‌ను మెంటార్‌గా లేదా హెడ్ కోచ్‌గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా కేకేఆర్ (KKR) టీమ్ మెంటార్‌గా ద్రవిడ్ నియమితుడు కాబోతున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. గత సీజన్‌లో కేకేఆర్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
గంభీర్ దూరం కావడంతో కేకేఆర్ మెంటార్ పోస్ట్ ఖాళీ అయింది. ఆ పోస్ట్ కోసం ద్రవిడ్‌ను కేకేఆర్ ఫ్రాంఛైజీ సంప్రదించిందని సమాచారం. తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) ఫ్రాంఛైజీ కూడా ద్రవిడ్ పట్ల ఆసక్తిగా ఉందట. తమ టీమ్ హెడ్ కోచ్ పదవిని ద్రవిడ్‌కు అప్పగించాలనుకుంటోందట. ఇప్పటికే ద్రవిడ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. రాజస్తాన్ టీమ్‌తో ద్రవిడ్‌కు చాలా అనుబంధం ఉంది. ఆటగాడిగా ఉన్నప్పుడు ఆర్ఆర్ టీమ్‌కు ద్రవిడ్ సారథ్యం వహించాడు. రిటైర్ అయిన తర్వాత ఆర్‌ఆర్‌కు మెంటార్‌గా కూడా పని చేశాడు.
ప్రస్తుతం ఆర్ఆర్ టీమ్‌కు కుమార సంగక్కర హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిసున్నాడు. ఒకవేళ ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవిలోకి వస్తే సంగక్కరకు ఫ్రాంఛైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవి అప్పగిస్తారట. రాజస్తాన్ టీమ్ మేనేజ్‌మెంట్, ద్రవిడ్ మధ్య చర్చలు జరుగుతున్నట్టు ఫ్రాంఛైజీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి..
Indian team selection : ఏ సిరీస్ ఆడాలనేది.. ఇకపై ఆటగాళ్ల ఇష్టం కాదు
Tennis : టెన్నిస్ త్రయం.. తెచ్చేనా పతకం?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..