Home » Rajya Sabha
ఢిల్లీ సర్వీసుల బిల్లును ఏం చేసైనా సరే సాధించాలని బీజేపీ అనుకుంటోందని, ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని, ప్రాథమికంగా ప్రజావ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి అన్నారు. ఢిల్లీ సీనియర్ ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు అప్పగించే ఆర్డినెన్స్ స్థానే ఢిల్లీ సర్వీసుల బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్షా సోమవారంనాడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు
గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2003ను కేంద్ర హోం మంత్రి అమిత్షా రాజ్యసభలో సోమవారంనాడు ప్రవేశపెట్టారు. విపక్ష పార్టీల ఆందోళనలు, సభా కార్యక్రమాల వాయిదాల మధ్య ఈ బిల్లును ఆయన ప్రవేశపెట్టడంతో వెంటనే చర్చ మొదలైంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ సర్వీసుల బిల్లు (Delhi Services Bill) సోమవారంనాడు రాజ్యసభలో (Rajya sabha) కేంద్రం ప్రవేశపెట్టనుండటంతో బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్ష పార్టీలు అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. బిల్లు సభ ముందుకు వస్తున్న దృష్ట్యా పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరు కావాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ విప్లు జారీ చేశాయి.
గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2023ను కేంద్ర హోం మంత్రి అమిత్షా ఈనెల 7వ తేదీ సోమవారంనాడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్కు బదిలీ చేసే ఆర్డినెన్స్ స్థానే కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన బిల్లును విపక్ష ఎంపీల ఆందోళన మధ్య లోక్సభ ఆమోదించింది.
ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెట్టే ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఈనెల 7వ తేదీ సోమవారంనాడు పెద్దల సభ ముందుకు రాబోతోంది. ఆర్డినెన్స్ స్థానే లోక్సభలో తీసుకువచ్చిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండమెంట్) బిల్లు-2023 ఇప్పటికే విపక్ష సభ్యుల ఆందోళన, వాకౌట్ల మధ్య లోక్సభ ఆమోదం పొందింది.
మణిపూర్ హింసాకాండ జ్వాలల వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్లమెంటులో గురువారం నవ్వులు విరిశాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మధ్య జరిగిన సంభాషణతో సభ్యులు గొల్లుమని నవ్వారు. రాజకీయ నినాదాలకు కాసేపు విరామం ఇచ్చి, ఆనందించారు.
న్యూఢిల్లీ: ఏపీ అప్పులపై కేంద్ర ఆర్ధిక శాఖ మరోసారి వివరాలు బయటపెట్టింది. రాష్ట్రంలో బడ్జెటేతర అప్పులు రూ. 79,815 కోట్లని పేర్కొంది. 2021-22, 2022-23... రెండు సంవత్సరాల్లో రూ. 70 వేల కోట్లకు పైగా...
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ హింసపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ తదితర పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘర్షణలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరం కావాలని భావిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియాగాంధీ కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ అవుతారని రెండుమూడు రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనారోగ్య కారణంతో 2024 లోక్సభ ఎన్నికల్లో సోనియాగాంధీ పోటీ చేసే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేసుకోవాలని సీఎం సిద్దరామయ్య విన్నవించినట్టు తెలుస్తోంది.
సోమవారం నాడు మరోసారి బీజేపీ కేంద్ర కార్యాలయంలో హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ సమావేశమై 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల వ్యూహాలు.. 3 రాష్ట్రాల్లో బీజేపీ రాజ్యసభ (Rajyasabha) అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఈ రాష్ట్రాల నుంచి ఒక తెలుగు నేతకు...