Home » Ram Mandir
అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన ముహూర్తం ముంచుకొస్తున్న వేళ రామయ్యకు కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 22న జరగబోయే వేడుకకు కనౌజ్ నుంచి వివిధ రకాల అత్తరులు, అమరావతి నుంచి 500 కిలోల కుంకుమ, ఢిల్లీ నుంచి రామాలయాల్లో సేకరించిన ధాన్యం అయోధ్యకు చేరుకున్నాయి.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, యూరప్‌లోని కొన్ని దేశాలు కరెన్సీపై హిందు దేవతల ఫొటోలు ఉన్నాయని గుర్తుచేశారు.
అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు మూడు రోజులు ముందే బాల రాముడి విగ్రహం తొలి చిత్రం శుక్రవారం వెలుగు చూసింది. కృష్ణశిలపై చెక్కిన రాముడి విగ్రహం ముగ్ధమనోహరంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహంలో శ్రీరాముడు పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ, చేతిలో బంగారు
అయోధ్య ( Ayodhya ) లో ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్‌లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీరామజన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
జనవరి 22వ తేదీ రామ భక్తులకు ఎంతో ప్రత్యేకమైన, చిరస్మరణీయమైన దినమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఆరోజు అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుంది. అలాగే.. అదే రోజున ఒడిశాలో నిర్మించిన రామమందిరాన్ని కూడా ప్రారంభించబోతున్నారు.
Lord Ram in Ayodhya Ram Mandir: భారత ప్రజలే కాకుండా.. యావత్ ప్రపంచంలోని హిందూ సమాజం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా రామాలయం గర్భగుడిలో బాల రాముడి ప్రతిమను ప్రతిష్ఠించారు ఆలయ నిర్వాహకులు.
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.
అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి రామ్ లల్లా (బాలరాముడు) ప్రవేశించారు. రామ్ లల్లా ఐదేళ్ల బాలుడిగా దర్శనం ఇస్తారు. ఆ విగ్రహం ఎలా ఉండనుందో అనే సందేహాం ప్రతి ఒక్కరిలో నెలకొంది. బాల రాముడి విగ్రహ ఫొటోను ఓ జాతీయ వార్తా సంస్థ విడుదల చేసింది.
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తోంది. వరంగల్, కాజీపేట నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్ వేశారు.