Home » Russia
దాదాపు ఏడాన్నదిన్నర కాలంగా ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలైన రష్యా.. దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలిసారి లునార్ మిషన్ ప్రయోగం చేపట్టింది. 1976 తర్వాత చంద్రుడిపైకి తొలిసారి లునా-25 (Luna-25) ప్రయోగించింది. మస్కో కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 2.10 గంటల సమయంలో వొస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుంచి ఈ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టినట్టు రష్యన్ స్పేస్ ఏజెన్సీ ‘రొస్కోస్మోస్’ (Roscosmos) ప్రకటించింది.
గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి.. ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీని హతమార్చేందుకు రష్యా కుట్రలు పన్నింది. జెలెన్స్కీ మృతి ఉక్రెయిన్ దళాల ధైర్యాన్ని దెబ్బ తీస్తుందని..
భారతీయ పర్యాటకులకు రష్యా పండగలాంటి వార్త చెప్పింది. 2020లో మహమ్మారి కరోనా కారణంగా నిషేధించిన ఎలక్ట్రానిక్ వీసా (Electronic Visa) ను రష్యా (Russia) తిరిగి ప్రారంభించింది. ఆగస్టు 1వ తారీఖు నుంచి భారత పాస్పోర్టు హోల్డర్లు ఇ-వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.
రష్యా రాజధాని నగరం మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఆదివారం ఉదయం మూడు డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసింది. దీంతో మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కాసేపు మూసేశారు. నగర శివారు ప్రాంతంలో ఓ డ్రోన్ను కూల్చేయగా, మరో రెండిటిని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దెబ్బతీసింది. ఇవి ఓ కార్యాలయం భవన సముదాయంలో కూలిపోయాయి. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు.
గతేడాదిలో రష్యా-క్రిమియాని కలిపే కర్చ్ బ్రిడ్జ్పై భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో భాగంగా..
ఒకటి రెండు కాదు.. ఏకంగా 20ఏళ్లు కష్టపడి 12కిలోమీటర్ల గొయ్యి తవ్వారు కొందరు. అంతా తవ్వాక వాళ్ళకు కనిపించిందేంటో తెలిస్తే షాకవుతారు..
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్న పాకిస్థాన్, చైనాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కడిగిపారేశారు. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పు అని, దీనిని కట్టడి చేయడానికి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. దీనిపై మనమంతా కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. షాంఘై సహకార సంఘం (SCO) వర్చువల్ సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ప్రభావం భారత దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రశంసించారు. మోదీని రష్యాకు గొప్ప మిత్రునిగా ఆయన అభివర్ణించారు. రష్యా ప్రభుత్వ నియంత్రణలోని అంతర్జాతీయ వార్తా టెలివిజన్ నెట్వర్క్ ఈ వివరాలను వెల్లడించింది.
యెవ్జెనీ ప్రిగోజిన్ సారథ్యంలోని వాగ్నర్ ప్రైవేటు సైన్యం ఈ వారాంతంలో చేసిన తిరుగుబాటును కేవలం 24 గంటల్లోనే అణిచివేసిన రష్యా అధ్యక్షుడు వ్యాడిమిర్ పుతిన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వాగ్నర్ గ్రూప్ యోధుల్లో చాలా మంది దేశభక్తులున్నారని, వారిని ప్రభుత్వ సైన్యంలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు.
శనివారం రష్యాలో అనూహ్య పరిణామాలు అధ్యక్షుడు పుతిన్ను కలవరపెట్టాయి. పుతిన్ పెంచి పోషించిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ఊ హించని తిరుగుబాటు చేయడంతో దాదాపు రష్యాలో అంతర్యుద్ధం పరిస్థితులు నెలకొన్నాయి.