Home » Russia
జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని భావించిన తన ఆకాంక్షలకు పేదరికం అడ్డొచ్చిందని.. విదేశాల్లో శిక్షణ, ఉపాధి కోసం అవసరమైన డబ్బును సమకూర్చుకోలేకపోయానన్న ఆవేదనతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రష్యా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి చెందారు. ఈ మేరకు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని భారతీయ రాయబారి కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. మృతి చెందిన విద్యార్థుల వయస్సు 18-20 ఏళ్ల మధ్య ఉంటుందని వివరించింది. వెలికి నొవ్గోరోడ్ నగరంలోని నొవ్గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారని తెలిపింది.
సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా ప్రపంచం మొత్తం వైరల్ అవుతోంది. అంతేకాదు ఎంతో మంది వ్యక్తుల టాలెంట్ బయట ప్రపంచానికి తెలుస్తోంది. సామాన్యమైన వ్యక్తుల్లో ఉంటే నైపుణ్యత బయట వ్యక్తులకు తెలియడానికి సోషల్ మీడియా ఓ సాధనంగా ఉపయోగపడుతోంది.
రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మరో ఆరేళ్లు రష్యా అధ్యక్షుడిగా ఆయన కొనసాగనున్నారు. మార్చిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ గెలుపొందారు. దీంతో మంగళవారం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం క్రిమ్లిన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రష్యా అధ్యక్షుడిగా ఆయన అయిదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు బహిష్కరించాయి.
పాఠశాలల్లో బాంబులు పెట్టామనే బెదిరింపు ఈమెయిళ్లతో ఢిల్లీలో బుధవారం కలకలం చెలరేగింది. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళనతో స్కూళ్లకు పరుగులు తీశారు.
ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరంలో నల్లసముద్ర తీరం వెంబడి ఉన్న ఓ అందమైన కట్టడం, స్థానికంగా హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధికెక్కిన భవనాన్ని రష్యా క్షిపణిదాడులు జరిపి ధ్వంసం చేసింది.
ప్రపంచంలోని మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ సిరీస్ ‘హ్యారీపోటర్’లోని అందమైన కోట గుర్తుందా? అదేనండి.. మ్యాజికల్ స్కూల్! అచ్చం అలాంటి భవనమే ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరంలో ఉంది. ఇప్పుడిది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ధ్వంసమైంది.
సుమారు ఆరేళ్ల క్రితం చనిపోయాడనుకున్న అమెరికా బిలియనీర్ కార్ల్ ప్రస్తుతం రష్యా గూఢచారి అయిన తన గర్ల్‌ఫ్రెండ్‌తో అక్కడే ఉంటున్నాడని తెలిసి అంతా షాకైపోతున్నారు.
యూరప్‌లో కొన్ని విమానాలు దారి తప్పుతున్నాయి. నావినేషన్ వ్యవస్థను ఎవరో ప్రభావితం చేస్తున్నారని పైలట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో సమస్య ఏర్పడింది. గత రెండు రోజుల నుంచి ఎక్కువగా ఉంది. వెయ్యికి పైగా విమానాల నావిగేషన్ సమస్య ఎదుర్కొన్నాయి.