Putin Record: రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - May 07 , 2024 | 04:52 PM
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం క్రిమ్లిన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. రష్యా అధ్యక్షుడిగా ఆయన అయిదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు బహిష్కరించాయి.
న్యూడిల్లీ, మే 07: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం క్రిమ్లిన్‌లో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. రష్యా అధ్యక్షుడిగా ఆయన అయిదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు బహిష్కరించాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం ప్రకటించడంతో.. ఆ యా దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
Loksabha Elections: బీజేపీలో చేరిన శేఖర్ సుమన్, రాధిక
రష్యా రాజ్యాంగం ప్రకారం 2030 వరకు ఆయన అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. 1999 నుంచి దాదాపు 25 ఏళ్ల పాటు పుతిన్ కొనసాగుతూ వస్తున్నారు. మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థులను తొలగించడంతోపాటు ఉక్రెయిన్ యుద్ద సమస్యల మధ్య అన్ని అధికారాలను పుతిన్ తన అధీనంలోకి తెచ్చుకున్నారు.
LokSabha Elections: అఖిలేష్ యాదవ్ ప్రత్యేక పూజలు.. ఆలయాన్ని శుద్ది చేసిన బీజేపీ శ్రేణులు
ఈ సందర్బంగా పుతిన్ మాట్లాడుతూ.. మనందరం సమైక్యంగా ఉండి.. రష్యాని గొప్ప దేశాన్ని తీర్చిదిద్దాలన్నారు. అందుకోసం ఎదురయ్యే అడ్డంకులన్నీ అదిగమించాలన్నారు. ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లితే.. విజయం సాధించ వచ్చునని చెప్పారు. రష్యా.. ఇతర దేశాలతో సంబందాలు అభివృద్ది చేసుకోనేందుకు చర్యలు చేపడుతుందని పుతిన్ స్పష్టం చేశారు.
Read Latest National News and Telugu News