Share News

Russia: నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి

ABN , Publish Date - Jun 07 , 2024 | 03:48 PM

రష్యా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి చెందారు. ఈ మేరకు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని భారతీయ రాయబారి కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. మృతి చెందిన విద్యార్థుల వయస్సు 18-20 ఏళ్ల మధ్య ఉంటుందని వివరించింది. వెలికి నొవ్గోరోడ్ నగరంలోని నొవ్గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారని తెలిపింది.

Russia: నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి

మాస్కో, జూన్ 07: రష్యా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి చెందారు. ఈ మేరకు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని భారతీయ రాయబారి కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. మృతి చెందిన విద్యార్థుల వయస్సు 18-20 ఏళ్ల మధ్య ఉంటుందని వివరించింది. వెలికి నొవ్గోరోడ్ నగరంలోని నొవ్గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారని తెలిపింది.


వోల్ఖోవ్ నదిలో కొట్టుకుపోతున్న యువతిని రక్షించేందుకు నలుగురు సహచర విద్యార్థులు ప్రయత్నించారు. ఆ క్రమంలో వారు సైతం నీట మునిగారు. అయితే స్థానికులు వెంటనే స్పందించి.. ఒకరిని స్థానికులు రక్షించారు. అయితే విద్యార్థుల మృతదేహాలను సాధ్యమనంత త్వరలో.. స్వస్థలాలకు పంపుతామని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది. అందుకోసం యూనివర్శిటి అధికారులను సంప్రదిస్తున్నామని పేర్కొంది.


మరోవైపు... రష్యాలోని నదిలో నీట మునిగి మృతి చెందిన విద్యార్థల స్వస్థలం మహారాష్ట్ర జలగావ్ జిల్లాలోని అమల్నేరు. ఈ ఘటనపై ఇప్పటికే జలగావ్ జిల్లా కలెక్టర్ అయుష్ ప్రసాద్ స్పందించారు. మృతదేహాలను స్వస్థలం తీసుకు వచ్చేందుకు రష్యాలోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదిస్తున్నట్లు చెప్పారు.

For Latest News and National News click here

Updated Date - Jun 07 , 2024 | 03:51 PM