Home » Sachin Tendulkar
ప్రముఖ క్రికెట్ స్టేడియం వాంఖడేలో నేడు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సచిన్ స్టాండ్స్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. సచిన్ ఐకానిక్ షాట్లలో ఒకటైన ఆఫ్‌సైడ్ షాట్ ఆడుతున్నట్టుగా విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో చరిత్రాత్మక రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 77 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 26 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 25,923 పరుగులు ఉన్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లెజెండ్రీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక బహుమతి ఇచ్చారు. 'నమో' నెంబర్ 1 పేరున్న ప్రత్యేక టీమిండియా జెర్సీని అందజేశారు.
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 13వేల పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 267 ఇన్నింగ్స్‌లలోనే కోహ్లీ 13వేల రన్స్ మార్క్ అందుకున్నాడు. దీంతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ 321 ఇన్నింగ్స్‌లలో 13వేల పరుగులు పూర్తి చేశాడు.
ఆసియా కప్ 2023 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో చెలరేగిన హిట్‌మ్యాన్ మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
భారత రత్న, భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు నిరసన సెగ తగిలింది. ఓ ఆన్లైన్ గేమింగ్ యాప్‌నకు సచిన్ ప్రమోషన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనకారులు బాంద్రాలోని ఆయన ఇంటి ముందు నిరసనకు దిగారు.
బుధవారం నుంచి ప్రారంభమైన ఆసియా కప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌కు చెందిన ఓ రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆసియా కప్‌లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్రేక్ చేసే అవకాశాలున్నాయి. టీమిండియా ఆటగాళ్ల పరంగా ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది.
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్(Hardik Pandya) పాండ్యా ఇటీవల వరుసగా విమర్శలకు గురవుతున్నాడు. వన్డే సిరీస్ సమయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(west indies cricket board) సరైన వసతులు కల్పించడంలేదని మాట్లాడి పలువురు నుంచి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక మొదటి రెండు టీ20ల్లో ఓడిన తర్వాత హార్దిక్ కెప్టెన్సీపై విమర్శల వర్షం కురిసింది.