Home » Sajjala Ramakrishna Reddy
రెండు రోజుల నుంచి ఏపీలో రాజకీయ క్రీడలు జరుగుతున్నాయని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాుడూత.. ఏపీ సీఎం జగన్పై దాడి ఒక డ్రామా అని అన్నారు. ఏపీలో ప్రజలను పక్కదారి పట్టించే విధంగా సాక్షి రాతలు ఉన్నాయన్నారు. రాయి ఘటనకు వ్యూహకర్త సజ్జల అని పేర్కొన్నారు. మాటువేసి మట్టుబెట్టే కుట్ర చేస్తున్నారని సాక్షిలో రాసుకున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ప్రకంపనలు రేపుతోంది. రాయి దాడిని నేతలందరూ ఖండించారు. దాడి ప్రణాళిక ప్రకారమే జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదే అంశంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీలో ఎలక్షన్ కోడ్ నడవట్లేదని వైసీపీ (YSRCP) కోడ్ కొనసాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheswara Rao) అన్నారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు దేవినేని మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ఎన్నికల ఉల్లంఘనలపై ప్రశ్నించిన ప్రజలపై ఆ పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ నేతల రాజకీయమంతా వలంటీర్ల చుట్టే తిరుగుతోంది. ఇటీవల వలంటీర్ల వ్యవస్థ అలాగే ఉంటుందని.. వారి విషయంలో తమ ప్రభుత్వం వచ్చినా కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. అప్పటి నుంచి వైసీపీ నేతలకు గొంతులో వెలక్కాయ పడినట్టు అయ్యింది.
Sajjala Rama Krishna Reddy: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) గీత దాటుతున్నారని, ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉండి రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని అందిన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్కుమార్ మీనాకు పాలుపోవడం లేదు. సజ్జల ఓ వైసీపీ కార్యకర్తలా విపక్షాలపై విషం చిమ్ముతున్నారని..
Andhrapradesh: ఏపీలో పెన్షన్ల పంపిణీ అంశం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఇస్తామన్న సమయకంటే ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో పెన్షన్లు తీసుకోడానికి సచివాలయాలకు వచ్చిన వృద్ధులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు తనువులు కూడా చాలించారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ సీరియస్ తీసుకుని ఈసీకి లేఖలు కూడా రాసింది. అయితే వృద్ధులు చనిపోవడంపై తాజాగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకి తెలుగుదేశం ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని చెప్పారు.
ఇడుపుల పాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) బస్ యాత్ర ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి(Sajjala Rama Krishna Reddy) అన్నారు. ఈ నెల 27వ తేదీన ఇడుపుల పాయ నుంచి జగన్ బస్ యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయడమే జగన్ లక్ష్యమన్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈనెల 27 నుంచి బస్సుయాత్ర ప్రారంభిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సిద్దం పేరుతో రాష్ట్రంలో నాలుగు చోట్ల సభలు నిర్వహించామన్నారు. సీఎం జగన్ 20 ఏళ్ల పాటు జరగని అభివృద్దిని చేశారన్నారు. మ్యానిఫెస్టోలో 99శాతం హమీలు నెరవేర్చేశామని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర నేతలతో వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు.