Share News

Dokka: సమయం ఇవ్వకుండా కల్కి సినిమాలోలా కుట్రలు.. మాజీ మంత్రి ఫైర్

ABN , Publish Date - Aug 03 , 2024 | 01:11 PM

Andhrapradesh: నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆరు నెలలైనా సమయం ఇవ్వాలని... అయితే ఆ సమయం ఇవ్వకుండా కల్కి సినిమాలో కమాండర్ చేసినట్టు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కాంప్లెక్స్‌లో కూర్చుని ఆ కుట్రలు చేస్తోంది సజ్జల రామకృష్ణారెడ్డి అని అన్నారు.

Dokka: సమయం ఇవ్వకుండా కల్కి సినిమాలోలా కుట్రలు.. మాజీ మంత్రి ఫైర్
Former Minister Dokka Manikya Varaprasad

అమరావతి, ఆగస్టు 3: నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆరు నెలలైనా సమయం ఇవ్వాలని... అయితే ఆ సమయం ఇవ్వకుండా కల్కి సినిమాలో కమాండర్ చేసినట్టు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ (Former Minister Dokka Manikya Varaprasad) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కాంప్లెక్స్‌లో కూర్చుని ఆ కుట్రలు చేస్తోంది సజ్జల రామకృష్ణారెడ్డి (YSRCP Leader Sajjala ramakrishna Reddy) అని అన్నారు.

TG News: తెలంగాణ ఎక్సైజ్ శాఖలో అక్రమాలు.. కాగ్ నివేదికలో సంచలన విషయాలు..


రాష్ట్రంలో ఉన్న రౌడీలను అక్కడికి పిలిచి అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో నూతన ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ రౌడీలపైన ప్రభుత్వం కన్నేసి ఉంచాలన్నారు. గతంలో ఎక్కడ శవం దొరికిన అది మాదే అని పరామర్శకు వెళ్లేవారు ఇప్పుడు ఎక్కడ మర్డర్ జరిగిన దానికికారణం టీడీపీ అంటూ వారిపై నెట్టేస్తున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో మద్యం అమ్మకాల్లో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యుల నుండి ఆ సొమ్మును రికవరీ చేయాలని కోరారు.

Budda Venkanna: నా మాట ఆవేదనతోనే.. వ్యతిరేకతతో కాదు.. బుద్దా కీలక వ్యాఖ్యలు


మద్యం తాగి ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న కేసులు గత ఐదేళ్లలో భారీ సంఖ్యలో ఉన్నాయన్నారు. వారంతా జే బ్రాండ్ మద్యం తాగి లివర్లు చెడిపోయి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మద్యం కుంభకోణంలో బాధ్యుల నుంచి రికవరీ చేసిన సొమ్మును వారికి కాంపెన్సేషన్‌గా ఇవ్వాలన్నారు. గడిచిన ఐదేళ్లలో జే బ్రాండ్ మద్యం తాగి అనేక మంది యువకులు కూడా అనారోగ్యానికి లోనవుతున్నారని డొక్కా మాణిక్య వరప్రాసద్ విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

Gold Rates: 70 వేల మార్క్ చేరిన బంగారం ధర

Purandeswari: చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా పని చేస్తోంది

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 03 , 2024 | 01:14 PM