Home » Schools
వడోదరలో ఓ పాఠశాల తరగతి గదిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలోని వాఘోడియా రోడ్డులోని శ్రీ నారాయణ్ గురుకుల పాఠశాల మొదటి అంతస్తులో శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేసే సమయంలో తరగతి గది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఓ విద్యార్థికి గాయాలు అయ్యాయి.
జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) ఎన్.వి.దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టు ల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయడానికి హైకోర్టు ఆసక్తి చూపకుండా విచారణను వాయిదా వేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ అటెంటెన్స్ అమలుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు నెలల పాటు వాయిదా వేసింది. డిజిటల్ అటెండెన్స్ నిర్ణయంపై బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ మాయావతి మంగళవారంనాడు నిశిత విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో యోగి సర్కార్ తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
అందీ అందని పౌష్టికాహారం.. చిన్నారులపై మొక్కుబడి పర్యవేక్షణ.. పారిశుధ్య లోపం..! ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాల స్వరూపం ఇది. ఇకపై మాత్రం.. చదువు, ఆరోగ్యంతో పాటు పిల్లల మానసిక ఉల్లాసానికి ఆటలు.. బోధనలోనూ కొత్త పద్ధతులతో సరికొత్త రూపం సంతరించుకోనున్నాయి.
తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీఎండబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే గురుకులాల ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
విద్యార్థులు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో భోజన, శానిటేషన్ కాంట్రాక్ట్‌లను మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మహిళా గ్రూపులు తమను సంప్రదిస్తే పనులను అప్పగిస్తామని గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు.
శివగంగ జిల్లా మరవమంగళం గ్రామంలోని పంచాయతీ ప్రాథమిక పాఠశాల(Primary school) కొత్త రూపు సంతరించుకుంది. ఇటీవల ఆ పాఠశాలకు రూ.10.67లక్షలతో మరమ్మతులు చేపట్టారు. ప్రతి తరగతి గదిని రైలు బోగీ(Train bogie)లా పెయింటింగ్ చేశారు.
Telangana: అమ్మో ఆ స్కూల్లో దెయ్యం ఉంది.. మాకు భయం.. మేం స్కూల్‌కు వెళ్లం అని భయపడుతున్నారు అక్కడి విద్యార్థులు. అయితే స్కూల్లో విద్యను చెప్పే టీచర్లు... విద్యార్థులకు ధైర్య సాహసాలు కూడా నేర్పిస్తుంటారు.