Share News

Viral News: వడోదరలో షాకింగ్ ఘటన.. కొంచెం అయితే ఇక అంతే..!

ABN , Publish Date - Jul 20 , 2024 | 05:01 PM

వడోదరలో ఓ పాఠశాల తరగతి గదిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలోని వాఘోడియా రోడ్డులోని శ్రీ నారాయణ్ గురుకుల పాఠశాల మొదటి అంతస్తులో శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేసే సమయంలో తరగతి గది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఓ విద్యార్థికి గాయాలు అయ్యాయి.

Viral News: వడోదరలో షాకింగ్ ఘటన.. కొంచెం అయితే ఇక అంతే..!

గుజరాత్‌: వడోదరలో ఓ పాఠశాల తరగతి గదిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలోని వాఘోడియా రోడ్డులోని శ్రీ నారాయణ్ గురుకుల పాఠశాల మొదటి అంతస్తులో శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేసే సమయంలో తరగతి గది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఓ విద్యార్థికి గాయాలు అయ్యాయి.


ఘటనకు సంబంధించిన వివరాలు..

రోజు మాదిరిగానే విద్యార్థులు శుక్రవారం రోజున నారాయణ్ గురుకుల పాఠశాలకు వచ్చారు. క్లాసులు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12:30గంటల సమయంలో ప్రశాంతంగా భోజనం చేస్తున్నారు. అయితే ఆ రోజు మాత్రం విద్యార్థులకు ఎప్పటిలాగే మామూలుగా గడవలేదు. ఏమైందో తెలీదు కానీ.. ఉన్నట్టుంది ఒక్కసారిగా మెుదటి అంతస్థు గోడతో సహా సగం కూలిపోయింది. దీంతో పలువురు విద్యార్థులు కింద పడిపోయారు. ఘటనలో ఏడో తరగతి విద్యార్థి తలకు స్వల్పగాయాలు అయ్యాయి. పలు సైకిళ్లు ధ్వంసం అయ్యాయి.


పాఠశాల ప్రిన్సిపల్ రూపల్ షా తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. హుటాహుటిన సిబ్బంది మెుత్తం అక్కడికి చేరుకున్నాం. పలువురు విద్యార్థులు కిందపడిపోయి ఉన్నారు. అందులో ఒకరి తలకు గాయమైంది. అతణ్ని వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం. మిగిలిన విద్యార్థులను సైతం సురక్షిత ప్రదేశానికి తరలించాం. విద్యార్థుల సైకిళ్ల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలంపై గోడ కూలిపోయింది. దీంతో దాదాపు 12 సైకిళ్ల వరకు దెబ్బతిన్నాయి. వెంటనే వడోదర అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చాం. పాఠశాలకు చేరుకున్న వారు వెంటనే సహాయక చర్యలు చేపట్టారని" ఆయన చెప్పారు.


ప్రమాదంలో స్వల్పగాయాలతో గాయపడి చికిత్సపొందుతున్న 7వ తరగతి విద్యార్థి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. గోడ కూలిపోవడంపై పాఠశాల నుంచి తమకు ఫోన్ వచ్చినట్లు అగ్నిమాపక శాఖ అధికారి వినోద్ మోహితే తెలిపారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్నామని, ఓ విద్యార్థికి స్వల్పగాయాలు అయ్యాయని ఆయన చెప్పారు. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, శిథిలాలు తొలగించగా.. సుమారు 10నుంచి 12సైకిళ్ల ధ్వంసమై ఉన్నట్లు గుర్తించామని వినోద్ మోహితే తెలిపారు. అయితే ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Updated Date - Jul 20 , 2024 | 05:01 PM