Share News

TS News: స్కూల్లో దెయ్యం ఉందన్న స్టూడెంట్స్.. టీచర్స్ ఏం చేశారో తెలుసా?

ABN , Publish Date - Jul 10 , 2024 | 10:11 AM

Telangana: అమ్మో ఆ స్కూల్‌లో దెయ్యం ఉంది.. మాకు భయం.. మేం స్కూల్‌కు వెళ్లం అని భయపడుతున్నారు అక్కడి విద్యార్థులు. అయితే స్కూల్లో విద్యను చెప్పే టీచర్లు... విద్యార్థులకు ధైర్య సాహసాలు కూడా నేర్పిస్తుంటారు.

TS News: స్కూల్లో దెయ్యం ఉందన్న స్టూడెంట్స్.. టీచర్స్ ఏం చేశారో తెలుసా?
School Students

ఆదిలాబాద్, జూలై 10: అమ్మో ఆ స్కూల్‌లో (School) దెయ్యం ఉంది.. మాకు భయం.. మేం స్కూల్‌కు వెళ్లం అని భయపడుతున్నారు అక్కడి విద్యార్థులు. అయితే స్కూల్లో విద్యను చెప్పే టీచర్లు... విద్యార్థులకు (Studenets) ధైర్య సాహసాలు కూడా నేర్పిస్తుంటారు. ఇదే విధంగా దెయ్యం అంటూ భయపడ్డ విద్యార్థులకు.. అక్కడ దెయ్యం ఏం లేదంటూ నిరూపించేందుకు సదరు టీచర్లు ఏం చేశారో చూసేద్దాం.

TDP: టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం


అసలు ఏం జరిగిందంటే?

ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం ఆనంద్‌పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో గతకొంత కాలంగా విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. స్కూల్లో దెయ్యం ఉందంటూ కొందరు విద్యార్థులు పాఠశాలకు రావాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు. విషయం తెలిసిన టీచర్లు... విద్యార్థుల్లో దెయ్యం భయాన్ని పోగోట్టాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా ఓ టీచర్ రాత్రంతా స్కూల్‌లోనే నిద్రించారు. పాఠశాల ఆవరణలో చెట్టు కూలడం, అలానే ఓ ఖాళీ గది నుంచి అరుపులు వస్తున్నాయని దెయ్యం ఉందనే భయం విద్యార్థుల్లో మొదలైంది. వారిలో భయం పోగొట్టేందుకు స్కూల్ టీచర్ రవీందర్ రాత్రంతా ఆ గదిలో నిద్రించారు. ఉదయం స్కూల్‌కు వెళ్లగా టీచర్ క్షేమంగా ఉండడం చూసి దెయ్యం లేదని విద్యార్థుల్లో నమ్మకం కలిగింది. దీంతో విద్యార్థులు భయాన్ని వీడి... సంతోషంగా పాఠశాలకు వస్తున్నారు. పిల్లల్లో దెయ్యం భయాన్ని పోగొట్టిన టీచర్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.


ఇవి కూడా చదవండి..

Viral: బాస్.. ఇక మీరు తప్పించుకోలేరు.. ఉద్యోగం కోసం ఓ వ్యక్తి అప్లయ్ చేసిన తీరు చూస్తే నవ్వాపుకోలేరు..!

Andhra Pradesh: స్కూల్‌కి వెళ్లి అదృశ్యమైన అమ్మాయిలు.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 10 , 2024 | 10:16 AM