Home » Siddipet
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మను చౌదరి,మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రైతు బందు డబ్బులు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు.
చేర్యాల(Cheryala) మండలం కమలాయపల్లి( Kamalayapally) గ్రామంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) పర్యటించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలను జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగపూరి రాజలింగంతో కలిసి ఆమె ఆవిష్కరించారు.
మాఫియా సామ్రాజ్య నిర్మాణానికి పునాది మల్లన్న సాగర్ ప్రాజెక్టు అని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి అన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల వ్యథను వివరిస్తూ సీనియర్ జర్నలిస్టు రేమిల్ల అవధాని రాసిన ‘ఊళ్లు-నీళ్లు-కన్నీళ్లు’ పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు.
జల్సాలకు అలవాటు పడిన ఓ వివాహిత.. ఇంటి యజమాని వద్ద ఉన్న డబ్బు, నగలపై కన్నేసింది. యజమాని కుమారుడైన పదహారేళ్ల బాలుడిని ప్రేమలోకి దింపి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆపై అబ్బాయి ద్వారా వారి ఇంట్లోని డబ్బు, నగలను తెప్పించింది.
కొందరిని చూసినా.. వారి గురించి విన్నా.. వీరెక్కడి మనుషులురా బాబూ అనిపిస్తుంటి. ఇప్పుడీ వార్త చదివితే అచ్చం అలాంటి అభిప్రాయం కలుగక మానదు. అవును.. 27 ఏళ్ల మహిళ.. 16 ఏళ్ల మైనర్ బాలుడిపై కన్నేసింది. ఆ పిల్లాడిని అన్ని రకాలుగా వాడుకుంది.
పేదల ఆకలి తీర్చిన నాయకుడు మోదీ అని.. ప్రజా సేవలో అబ్రహం లింకన్, మోదీ తమదైన ముద్ర వేశారని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన వర్సిటీ మూడో స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ మాట్లాడారు.
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలో చాణుక్యుల నాటి జైన సర్వోతభద్ర శిల్పం బయల్పడింది. ఈ గ్రామంలో అంగడి వీరన్న శివాలయంగా పిలుస్తున్న పురాతన జైనాలయం ఉంది.
రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదని, ఆయన ఎంత పెద్ద పదవులు అనుభవించినా ఉద్యమకారుడు మాత్రం కాలేడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహిగా రేవంత్ చరిత్రలో మిగిలిపోతాడని ఆయన పేర్కొన్నారు.
మాడు పగిలే ఎండ.. ఉక్కిరిబిక్కిరి చేసిన వాన! రెండూ ఒకేరోజు విరుచుకుపడటంతో ఆ కష్టనష్టాలు అన్నీఇన్నీకావు! ఎండదెబ్బకు ఇబ్బందిపడ్డ జనం పిడుగుపాట్ల శబ్దాలకూ వణికిపోయారు! వడదెబ్బ కొందరి ప్రాణాలు తీస్తే.. సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన చెట్లను కూకటివేళ్లతో పెకిలించి.. విద్యుత్తుస్తంభాలను పడగొట్టి.. ఇళ్లపై రేకులను గల్లంతు చేసి.. క్షణాల్లో లోతట్టు కాలనీలను జలమయంచేసి భీతావహ పరిస్థితిని సృష్టించింది.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జయజయహే గీతాన్ని నేడు జాతికి అంకితమివ్వనుండటంతో ఈ చరిత్రాత్మక ఘట్టానికి ముందు గేయ రచయిత అందెశ్రీ తన స్వగ్రామాన్ని సందర్శించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామాన్ని శనివారం సందర్శించిన ఆయన..