Home » Singanamala
గ్రామాభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. బుధవారం హిందూ శ్మశానవాటిక సౌకర్యార్థంతో పాటు సమీప కాలనీలకు రహదారి నిర్మాణానికి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.14లక్షల నిర్మాణ వ్యయంతో సీసీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
ఈ-పంట నమోదులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ హెచ్చరించారు. మండలంలోని కల్లుమడి, దనపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న ఈ-పంట నమోదు సూపర్ చెక్ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.
టీడీపీ ప్రభుత్వం వచ్చింది... మనల్ని ఎప్పుడు మారుస్తారో తెలియ దు... ఉన్నన్ని నెలల్లో ఏదో కొంత మందికి రేషన బియ్యం ఇచ్చి మిగితా వారికి ఇవ్వకుండా పక్కదా రి పట్టించినా పట్టించుకునేవా లేరు అన్న ధోరణి లో పలువురు రేషన డీలర్లు వ్యవహరిస్తున్నారు. నార్పల మండల వ్యాప్తంగా 52మంది రేషన డీల ర్లు ఉన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతోంది.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని చామలూరులో ఆదివారం నిర్వహించిన ‘ఇది మంచి ప్రభు త్వం’ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు హాజరయ్యారు.
గత వైసీపీ ప్రభుత్వం మండల వ్యాప్తంగా రీసర్వే చేపట్టిన తరువాత పలువురు రైతుల భూములు మా యం కావడంతో వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతు న్నారని ఎంపీటీసీ రఘునాథరెడ్డి రెవెన్యూ అఽధికారులను నిలదీశారు. స్థానిక మండల పరిషత కార్యాలయంలో గురువారం ఎంపీపీ యోగేశ్వరి అధ్యక్షతన ఎంపీడీఓ నిర్మ లకుమారి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలోని గ్రామల్లో తాగునీటి సమస్యను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కారించాలని ఎమ్మెల్యే బండా రు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన అధికారుల తో సమావేశం నిర్వహించారు.
మండలంలోని చిన్న జలాలపురం అంగన వాడీ కేంద్రం వద్ద పెరిగిన గడ్డిని, పిచ్చిమొక్కలను తొలగించాలని పిల్లలు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి చెందిన రెండు అంగనవాడీ కేంద్రాలను ఒక భవనంలో నిర్వహిస్తున్నారు. ఆ కేంద్రాలకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సు ఉన్న పిల్లలు 30 మంది వస్తారు.
వ్యాపార పరంగా దిన దినాభివృద్ధి చెందుతున్న మండలకేంద్ర మైన నార్పలలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తు న్నాయి. రోజూ రాత్రైతే చాలు ఎవరి ఇంట్లో దొంగలు చొర బడుతారో అనే భయం వారిలో నెలకొంది. కేవలం ఒకటి న్నర నెల వ్యవధిలోనే పెద్ద పెద్ద దొంగతనాలు జర గడం తో మండలకేంద్రం వాసులు నిద్రలేని రాత్రులు గడుపుతు న్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
మినీ లెదర్ పరిశ్రమను ప్రారంభించి దళిత కుటుంబాల్లోని యవతకు ఉపాధి కల్పిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. శుక్రవారం శింగనమల మండలంలోని రాచేపల్లి వద్ద మూతపడ్డ మినీ లెదర్ పరిశ్రమను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు.
నియోజకవర్గంలో సాగు, తాగునీటికి సమస్యల లేకుండా చూడాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కోరారు. దీనిపై కలెక్టర్ వినతి పత్రం అందజేశారు.