UPADHI: ఉపాధి కోసం ఎదురుచూపులు
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:01 AM
వలస కూలీల నివారణ కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా నార్పల మండలం బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. అయితే అధికారులు ఉపాధి పనులు కల్పించకపోవడంతో, పనుల కోసం కూలీలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈ మండలంలోనే నెలకొంది. నార్పల మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి 12వేల జాబ్‌కార్డులు ఉన్నాయి.

నార్పల, మార్చి30(ఆంధ్రజ్యోతి): వలస కూలీల నివారణ కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా నార్పల మండలం బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. అయితే అధికారులు ఉపాధి పనులు కల్పించకపోవడంతో, పనుల కోసం కూలీలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈ మండలంలోనే నెలకొంది. నార్పల మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి 12వేల జాబ్‌కార్డులు ఉన్నాయి. వర్షపు నీటి నిల్వ కోసం రాతి కట్టడం, వంకల్లో పూడిక తీత పనులు, కొండ దిగువ, ఎగువన ట్రెంచ ఏర్పాటు తదితర ఉపాధి ద్వారా చేపట్టాల్సిన ఎన్నో పనులు ఉన్నా యి. నెల రోజులుగా అధికారులు ఫాం పాండ్ల పనులు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో మండల వ్యాప్తంగా రెండు వేల మందికి మించి ఉపాధి కూలీలకు పనులకు వెళ్లడంలేదు. ఉపాధి ద్వారా చేపట్టాల్సిన అన్ని పనులు ఏర్పాటు చేస్తే దాదాపు ఆరు వేల మందికి పైగా పనులకు వెళ్లేవారు. ఇదిలాఉండగా ప్రస్తుతం ఎండాకాలం అయినందున ఫాం పాండ్ల పనులు చేయాలంటే, మట్టి ఎంత తవ్విన రావడంలేదని కూలీలు వాపోతున్నారు. చేతులు బొబ్బలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. నార్పల మేజరు పంచాయతీ పరిస్థితికి వస్తే... పనులకు వెళ్లాల్సిన దాదాపు వేయి మంది కూలీలు ఉన్నారు. 70 మంది మాత్రమే ఫాంపాండ్ల తవ్వకాలకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. అన్ని పనులు ఏర్పాటు చేయాలని, పనులు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా పట్టించుకోవడంలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారం పాండ్ల పనులు చేయలేమని మరికొందరు కూలీలు అర్జీల రూపంలో అధికారులకు అందజేసినా పట్టించుకోకపోవడం గమన్హారం. ఇప్పటికైనా సంబంఽధిత అధికారులు చొరవ తీసుకుని ఉపాధి హామీలోని అన్ని పనులు చేపట్టాలని మండలంలోని కూలీలు కోరుతున్నారు.
248 ఫాం పాండ్ల పనులు మంజూరయ్యాయి - రమేష్ రామారావు, ఏపీఓ
మండల వ్యాప్తంగా 248 ఫాం పాండ్ల పనులు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 30 మాత్రమే పూ ర్తయ్యాయి. 51 ఫాం పాండ్ల పనులు జరుగుతున్నా యి. 248 ఫాం పాండ్ల పనులు వెంటనే పూర్తి చేయాలని పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చా యి. ఇందు కోసం ఉపాధి హామీలో మిగతా పనులు పక్కనపెట్టి కేవలం ఫాం పాండ్ల పనులు మాత్రమే నిర్వహిస్తున్నాం. ఉపాధి కూలీలు ఫారం పాండ్ల పనులకు తక్కువగా వస్తున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....