MLA: తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన టీడీపీ
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:07 AM
తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఆవిర్భవించిందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మం డల పరిధిలోని నీలారెడ్డిపల్లిలో శనివారం టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకు లను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళలర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు.

- ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ
బుక్కరాయసముద్రం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఆవిర్భవించిందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మం డల పరిధిలోని నీలారెడ్డిపల్లిలో శనివారం టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకు లను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళలర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ...43 సంవత్సరాలుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ టీడీపీ అని వాఖ్యనించారు. టీడీపీ ఏర్పడిన అనంతరమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందారన్నారు. టీడీపీ నాయకులు పసుపుల శ్రీరామిరెడ్డి, ఎంపీపీ సునీత, మాజీ జడ్పీటీసీ షాలిని, పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు డేగల క్రిష్ణమూర్తి, నాయకులు చితంబరదొర, జీసీ బాబు, గుత్తా ఆదినారాయణ, ఓబులపతి, తలారి ఆది తదితరులు పాల్గొన్నారు.
శింగనమల: టీ డీపీ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా పా ర్టీకి సేవలు అందిం చిన 50 మంది సీని యర్ నాయకులు, కార్యకర్తలను నగ రంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రావణిశ్రీ సన్మానించారు. నాయకులు మారుతినాయుడు, చితంబరిదొర తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....