PROBLEM : తాగునీటికి కటకట..!
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:56 PM
మండలంలోని శివపురం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీలో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడి పోతున్నారు. కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించేదుకు ఎనిమిది నెలలు కిందట ఆర్డీటీ వారు బోరు వేసి, మోటారు ఏర్పాటు చేశారు. కానీ పంచాయతీ అధికారులు మోటారుకు విద్యుత కనెక్షన ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు.

- బోరు, మోటరు ఉన్నా విద్యుత కనెక్షన ఇవ్వడంలో జాప్యం
- ఎనిమిది నెలలుగా ఇబ్బందులు పడుతున్న ఎస్పీ కాలనీ వాసులు
శింగనమల, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని శివపురం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీలో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడి పోతున్నారు. కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించేదుకు ఎనిమిది నెలలు కిందట ఆర్డీటీ వారు బోరు వేసి, మోటారు ఏర్పాటు చేశారు. కానీ పంచాయతీ అధికారులు మోటారుకు విద్యుత కనెక్షన ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. నిధులు లేవని కాలం గడుపుతున్నారు. శివపురం గ్రామానికి చెం దిన ఎస్సీ కాలనీకి గతంలో తాగునీరు బోరు నుంచి పైపు లైన్లు ద్యారా నీరు సరఫరా అయ్యేది. అయితే అనంతపురం-తాడిపత్రి హైవే రోడ్డు పనులు జరగడంతో బోరు, పైపులైన్లు పూర్తిగా దెబ్బతిని కాలనీ వాసులకు నీటి సమస్య వచ్చింది. వారు ఎన్ని సార్లు పంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న ఆర్డీటీ వారు ఎనిమిది నెలలు కిందట బోరు వేసి, మోటారు బిగించారు. అయితే విద్యుత కనెక్షన కోసం పంచాయతీ సర్పంచ తీర్మానం చేసి, విద్యుత కనెక్షన, స్తంభాలు, వైరు కోసం కొంత సొమ్ము చెల్లించాలి. మోటారుకు విద్యుత కనెక్షన కోసం విద్యుత అధికారు లు ఎస్టిమేషన వేసి రూ.1.84లక్షలు చెల్లించాలని తెలిపారు. అయితే పంచాయతీలో డబ్బులు లేకపోవడంతో చెల్లించలేదు. దీంతో విద్యుత అధికారులు బోరు మోటారుకు విద్యుత కనెక్షన ఇవ్వలేదు. కాలనీలో నీటి సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తాగునీటి బోరుకు విద్యుత కనెన్షన ఇవ్యాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
పది రోజుల్లో కనెక్షన ఇస్తాం - భాస్కర్, ఎంపీడీఓ, శింగనమల
పంచాయతీలో నిధులు లేకపోవడంతో శివపురం ఎస్సీకాలనీకి చెందిన బోరుకు విద్యుత కనెక్షన కోసం విద్యుత అధికారుల ఎస్టీమేషన డబ్బులు చెల్లించలేదు. అయితే వేసవిని దృష్టిలో పెట్టుకుని 15 ఆర్థిక సంఘం నిధులను మండల పరిషత నుంచి మూడు రోజుల కిందట రూ.1.84లక్షలు విద్యుత శాఖకు పంపాం. మరో పది రోజుల్లో ఆ కాలనీ బోరుకు విద్యుత కనెక్షన ఇస్తారు. కాలనీకి నీటిని సరాఫరా చేస్తాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....