Share News

MLA : సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:03 AM

సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అన్నారు. మండల పరిధిలోని జంతులూరులో రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 220 కేవీ విద్యుత సబ్‌స్టేషనను ఎమ్మెల్యే శనివారం ముఖ్య అతిథిగా హజరై ప్రారంభించారు.

MLA : సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
MLA inaugurates electricity substation in Hayapur

- ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ

- 220కేవీ విద్యుత సబ్‌ స్టేషన ప్రారంభం

బుక్కరాయసముద్రం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అన్నారు. మండల పరిధిలోని జంతులూరులో రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 220 కేవీ విద్యుత సబ్‌స్టేషనను ఎమ్మెల్యే శనివారం ముఖ్య అతిథిగా హజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తున్నాయన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుతను అందించడంతో పాటు పగటి పూట అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే నూతనంగా సబ్‌స్టేషనను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత శాఖ శేషాద్రి, డీఈ రమేష్‌, ఏడీ రఘు, ఏఈ ప్రతాప్‌, టీడీపీ నేతలు పసుపుల శ్రీరామిరెడ్డి, ఎంపీపీ సునీత, ఓబులపతి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

శింగనమల, మార్చి 15(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని పలువురికి సీఎం రిలీఫ్‌ పండ్‌ చెక్కులను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అందజేశారు. ఎమ్మెల్యే శనివారం అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గంలోని 18 మంది బాధితులకు రూ. 22,12,600 చెక్కులను అంజేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 16 , 2025 | 01:03 AM