Home » Sports news
టీమిండియా (టీ20) కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో..
శ్రీలంకతో జరిగిన చివరి టీ 20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. సూపర్ ఓవర్లో సూర్యకుమార్ సేన జయకేతనం ఎగరవేసింది. నిన్నటి మ్యాచ్‌లో రెండు హైలెట్స్ ఉన్నాయి. ఒకటి బంతితో సూర్యకుమార్ రాణించడం.. మరొకటి రింకూ సింగ్ కూడా బాల్‌తో ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ వికెట్లు తీయడంతో కోచ్ గంభీర్ మొహం వెలగిపోయింది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
పారిస్ ఒలింపిక్స్ 2024(paris olympics 2024)లో షూటర్ మను భాకర్(Manu Bhaker) చారిత్రాత్మకమైన కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత, కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా(Mansukh Mandaviya) ఆమె విజయంపై అభినందనలు తెలియజేశారు. అంతేకాదు ఆమె శిక్షణ వెనుక ఉన్న కృషి, ఖర్చు వివరాలను కూడా వెల్లడించారు. మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
పారిస్ ఒలింపిక్స్ 2024(Paris Olympics 2024)లో భారత్‌కు మొదటి పతకాన్ని అందించిన స్టార్ షూటర్ మను భాకర్(Manu Bhaker) నుంచి మరో పతకం వచ్చే అవకాశం ఉంది. అవునండి నిజం. కానీ ఈసారి మాత్రం ఒంటరి కాదు, ఆమె సరబ్జోత్ సింగ్(Sarabjot singh)తో కలిసి కూడా అద్భుతంగా షూట్ చేసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఫైనల్లోకి ప్రవేశించింది.
శ్రీలంకతో టీ 20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంలో సూర్యకుమార్ అనుసరించిన వ్యుహాలు ఫలించాయి. దాంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ గురించి చర్చ జరుగుతోంది. సూర్య వేసిన ఎత్తుగడలు ఫలించాయి.
ఒలింపిక్ కామెంటేటర్ బాబ్ బల్లార్డ్ నోటి దూలను ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా మహిళ జట్టును అవహేళనగా మాట్లాడారు. ఆ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బాబ్ సహచరులు కూడా అతని కామెంట్లను ఖండించారు. ఇంకేముంది టెలివిజన్ బ్రాడ్ కాస్టర్ యూరోస్పోర్ట్స్ కంపెనీ చర్యలు తీసుకుంది. తక్షణమే బాబ్ను విధుల నుంచి తప్పించింది.
మహిళల ఆసియా కప్-2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలయ్యింది. ఈ టోర్నీలో వరుస విజయాలతో..
పారిస్ ఒలంపిక్స్ 2024లో భారత్ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. ఈ విశ్వ క్రీడలు ప్రారంభమైన మూడో రోజున ఓ కాంస్య పతకం భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మెడల్‌ను..
పారిస్ ఒలింపిక్స్ 2024లో(Paris Olympics 2024) మారథాన్ స్విమ్మర్లు, ట్రయాథ్లెట్ల ఈవెంట్లు సెయిన్ నది(Seine river)లో జరుగనుండగా కాలుష్యం కారణంగా మొదటి శిక్షణా సెషన్‌ను ఆదివారం రద్దు చేశారు. ఫ్రెంచ్ రాజధాని పారిస్‌లో నిరంతరంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నీటి కాలుష్య ప్రభావంపై ఆందోళనలు వచ్చిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మహిళల ఆసియా కప్ 2024లో(Womens Asia Cup 2024) భారత జట్టు(team india) సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక(srilanka)తో భారత్ నేడు తలపడనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది.