Share News

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌‌లో భారత్‌కు మరో మెడల్ వచ్చే ఛాన్స్.. ఫైనల్‌కు ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీం

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:58 PM

పారిస్ ఒలింపిక్స్ 2024(Paris Olympics 2024)లో భారత్‌కు మొదటి పతకాన్ని అందించిన స్టార్ షూటర్ మను భాకర్(Manu Bhaker) నుంచి మరో పతకం వచ్చే అవకాశం ఉంది. అవునండి నిజం. కానీ ఈసారి మాత్రం ఒంటరి కాదు, ఆమె సరబ్‌జోత్ సింగ్‌(Sarabjot singh)తో కలిసి కూడా అద్భుతంగా షూట్ చేసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించింది.

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌‌లో భారత్‌కు మరో మెడల్ వచ్చే ఛాన్స్.. ఫైనల్‌కు ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీం
Paris Olympics 2024

పారిస్ ఒలింపిక్స్ 2024(Paris Olympics 2024)లో భారత్‌కు మొదటి పతకాన్ని అందించిన స్టార్ షూటర్ మను భాకర్(Manu Bhaker) నుంచి మరో పతకం వచ్చే అవకాశం ఉంది. అవునండి నిజం. కానీ ఈసారి మాత్రం ఒంటరి కాదు, ఆమె సరబ్‌జోత్ సింగ్‌(Sarabjot singh)తో కలిసి కూడా అద్భుతంగా షూట్ చేసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించింది. దీంతో వీరికి దాదాపు పతకం ఖాయమని చెప్పలేం. కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నేడు జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతక మ్యాచ్‌కు సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మను భాకర్ అర్హత సాధించారు.


ఓడిన జట్టు

ఈ క్రమంలో మను భాకర్, సరబ్‌జోత్ సింగ్‌ జోడీ 580 మార్కులు సాధించారు. ఈ ఈవెంట్‌లో టర్కీ జట్టు 582 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. సెర్బియా జట్టు 581 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు టర్కియే, సెర్బియా మధ్య స్వర్ణం కోసం పోటీ జరగనుంది. గెలిచిన జట్టు స్వర్ణం, ఓడిన జట్టు రజతం కైవసం చేసుకుంటుంది. భారత్‌ 580 పాయింట్లు సాధించగా, కొరియా జట్టు 579 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

భారత్-కొరియా మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు కాంస్య పతకాన్ని అందుకోగా, ఓడిన జట్టు నిష్క్రమిస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం కొరియాతో తలపడనున్న టీమ్ ఈవెంట్‌లో మను, సరబ్‌జోత్ సింగ్‌ ద్వయం కాంస్యం గెల్చుకుంటుందా లేదా అనేది తేలనుంది.


మరోకటి మిస్

మను ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. దీంతో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా షూటర్‌గా నిలిచింది. 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్ షూటింగ్ రేంజ్‌లో భారత్‌కు పతకాన్ని అందించింది. మరోవైపు భారతదేశానికి చెందిన రమితా జిందాల్ గురించి మాట్లాడుకుంటే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఆమె ఫైనల్‌లో ఏడో స్థానంలో నిలిచింది. ఎనిమిది మంది షూటర్ల ఫైనల్లో రమిత 145.3 స్కోర్ చేసింది. ఎలిమినేషన్లు ప్రారంభమైనప్పుడు ఆమె పది షాట్ల తర్వాత ఏడో స్థానంలో ఉంది.

దీని తర్వాత ఆమె 10.5 షాట్‌తో ఆరో స్థానంలో నిలిచింది. నార్వేకు చెందిన హేగ్ లియానెట్ దస్తాద్ నిష్క్రమించింది. తదుపరి షాట్‌లో రమిత ఔట్ అయింది. ఆదివారం జరిగిన క్వాలిఫికేషన్‌లో ఆమె ఐదో స్థానంలో నిలిచింది. హాంగ్‌జౌ ఆసియా క్రీడల కాంస్య పతక విజేత రమిత దేశవాళీ ట్రయల్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేతలు మెహులీ ఘోష్, తిలోత్తమ సేన్‌లను ఓడించి పారిస్‌కు టిక్కెట్‌ను బుక్ చేసుకుంది.


ఇవి కూడా చదవండి:

MS Dhoni: సీఎస్కేకు ధోనీ గుడ్‌బై.. ఆ నలుగురి కోసమే త్యాగం?

Paris Olympics 2024: లక్ష్య సేన్ విజయం డిలీట్.. ఒలింపిక్స్‌లో భారత ఆటగాడికి వింత పరిస్థితి!


Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 29 , 2024 | 04:04 PM