Home » Srikalahasti
తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు మరో 26 మందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
శ్రీకాళహస్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాళహస్తిలో రోడ్ షో నిర్వహించి, బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇంకోవైపు అడుగడుగునా అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. టీడీపీ ఫ్లెక్సీలు కొన్నింటిని తొలగించారు. మరికొన్ని ఫ్లెక్సీల్లో సైకో పోవాలి అనే పదానికి అధికారులు రంగులు వేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనను వైసీపీ రణరంగంగా మార్చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్ధభేరి పేరుతో విస్తృత పర్యటన సాగిస్తున్నారు. అయితే.. చిత్తూరు జిల్లా పర్యటనలో అంగళ్లు, పుంగనూరులో వైసీపీ నేతలు రెచ్చిపోయి.. రణరంగంగా మార్చారు!. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి, టీడీపీ వాహనాలను ధ్వంసం చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సీఐ అంజూ యాదవ్.. (CI Anju Yadav) ఇప్పుడీ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది..! వైసీపీ బ్యాచ్ (YSRCP Batch) ఈమెను ఈమెను ‘లేడీ సింగం’.. ‘ఆంధ్రా కిరణ్ బేడీ’ గా.. సామాన్యులు, నెటిజన్లు మాత్రం వివాదాస్పద సీఐగా పిలుచుకుంటున్నారు.! ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచిన అంజూ యాదవ్.. జనసేన కార్యకర్తను అకారణంగా చెంపలకేసి కొట్టడం, ఈ వ్యవహారాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సీరియస్‌గా తీసుకొని స్వయంగా వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్లో పాపులర్ అయ్యారు...
అలిపిరి వద్ద 2003 అక్టోబరు 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌పై నక్సలైట్లు క్లైమోర్ మైన్స్ పేల్చిన ఘటనలో సీఎం కారుపైకి ఎక్కి సూపర్ కాప్‌గా పేరు తెచ్చుకున్న పోలీసు అధికారి అంజూ యాదవ్ ఇప్పుడు వరుస వివాదాలతో సొంత శాఖ ప్రతిష్ట మసకబారి పోయేందుకు కారకులవుతున్నారు.
మాజీ సీఎం చంద్రబాబు వద్దకు శ్రీకాళహస్తి టీడీపీ పంచాయతీ చేరింది. చంద్రబాబుతో బొజ్జల సుధీర్ రెడ్డి, ఎస్సీవీ నాయుడు భేటీ అయ్యారు. ఇటీవల నాయుడు టీడీపీలో చేరికపై బొజ్జల అభ్యంతరం తెలిపారు. అయితే ఈ సమావేశంతో నాయుడు చేరికకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. బొజ్జల సుధీర్ రెడ్డికి సహకరించాలని నాయుడుకు చంద్రబాబు సూచించారు. వచ్చే వారం ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరనున్నారు.
చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తీశ్వర ఆలయం (Srikalahastishwara Temple)లో చిన్నకొట్టాయి ఉత్సవం (Chinnakottai Festival) శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో అపచారాలు యధావిధిగా కొనసాగుతున్నాయి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం (Yuva Galam) పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. అడుగడుగునా ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలుకుతున్నారు...
శ్రీకాళహస్తి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఏర్పాటు చేసిన క్యాంప్ సైట్ నుంచి నారా లోకేష్ 23వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభమైంది.