Home » Srisailam
జగన్ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆరోపించారు. ఈ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో అత్యధిక శాతం కేటాయించిందని తెలిపారు.
శ్రీశైలాన్ని దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు. గురువారం నాడు శ్రీశైలంలో ముఖ్యమంత్రి పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) గురువారం రోజున శ్రీశైలం(Srisailam)లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమల శ్రీశైలం అడవులను గ్రేహౌండ్స్, బాంబుస్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. శ్రీశైలం ఆలయం, జలాశయం వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా పరిశీలించారు.
కృష్ణమ్మ జలసిరులకు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టును నిండు కుండలా చేసిన నదీమతల్లి నాగార్జునసాగర్ వైపు బిరబిరా పరుగులిడుతోంది. కృష్ణవేణి ప్రవాహ ధాటికి శ్రీశైలం గేట్లు మరిన్ని తెరుచుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ప్రజలు ఎంత బాగా ఆశీర్వదించారో రాష్ట్రాన్ని కూడా ప్రకృతి అదే విధంగా దీవిస్తోందని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ఏపీలో జలకళ సంతరించుకుందని ఆయన చెప్పారు.
కృష్ణమ్మ శ్రీశైలాన్నీ దాటేసి నాగార్జున సాగర్ దిశగా పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుతుండటంతో మూడు గేట్లు ఎత్తి, దిగువకు నీటిని వదిలిపెట్టారు. సాగర్లోకి 1.62లక్షల క్యూసెక్కుల నీరు వెళుతోంది.
ఏపీలోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంటుండటంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి ప్రాజెక్టు నుంచి నీటికి కిందికి వదిలారు.
నిరుటి ఇబ్బందికర పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చేస్తూ.. వానాకాలం పంటలకు ఊపిరి పోస్తూ.. శ్రీశైలం నుంచి కృష్ణమ్మ దిగువకు పరుగులు పెట్టనుంది. జూలై నెలలోనే బిరబిరా తరలివస్తూ.. నాగార్జున సాగర్ను చేరనుంది.
శ్రీశైలం దేవస్థానం పరిధిలోని పాతాళగంగ పాతమెట్ల రోడ్డు సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి పాతాళగంగ పాతమెట్ల రోడ్డు మార్గం రన్వేపై చిరుత..
Andhrapradesh: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడకు వెళ్తుంటారు. కొందరు వాహనాల్లో స్వామి దర్శనానికి వెళ్తే మరికొందరు నల్లమల అడవుల గుండా ఆ దేవదేవుడిని దర్శించుకునేందుకు పయమనవుతుంటారు.