Home » Stock Market
మంగళవారం భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్లు బుధవారం ఉదయం కూడా అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి. అయితే కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల నుంచి కోలుకుని లాభాల్లోకి వచ్చాయి.
22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే అక్టోబర్ 22 మంగళవారం ధరతో పోలిస్తే అక్టోబర్ 23 బుధవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గ్రాముకు ఒక రూపాయి ధర తగ్గింది. గ్రాము బంగారం ధర రూ.7,299గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.72,990గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము 7,963గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర..
యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల కారణంగా మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో సూచీలు తీవ్ర ఒడిదుడకులను ఎదుర్కొంటున్నాయి.
నేడు భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ ఏకంగా 971 పాయింట్లను నష్టపోయింది. దీంతోపాటు మిగతా సూచీలు మొత్తం కూడా రెడ్లోనే ముగిశాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
దీపావళి కోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఈ పండుగ సామాన్య ప్రజలకే కాకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్లో ముహూరత్ ట్రేడింగ్ చేసే సంప్రదాయం ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడం, చైనా వడ్డీ రేట్లను తగ్గించడంతో దేశీయ సూచీలు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.
దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్(Hyundai Motors)కు చెందిన భారతీయ అనుబంధ సంస్థ ఈ వారంలో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది.
భారత స్టాక్ మార్కెట్లో వచ్చే వారం మళ్లీ కొత్త ఐపీఓలు రాబోతున్నాయి. ఈసారి ఏకంగా 9 వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీల వివరాలు ఏంటి, ఎప్పటి నుంచి రాబోతున్నాయనేది ఇప్పుడు చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో నేడు (శుక్రవారం) బెంచ్మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ సహా బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా భారీ లాభాలతో ముగిశాయి. దీంతో మదుపర్లు పెద్ద ఎత్తున లాభాలను దక్కించుకున్నారా. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి విడుదలవుతున్న ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడం, విదేశీ మదుపర్లు నిధుల ఉపసంహరణ కొనసాగిస్తుండడంతో దేశీయ సూచీలు నష్టాల నుంచి తేరుకోలేకపోతున్నాయి. గురువారం భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు శుక్రవారం కూడా అదే బాటలో నడుస్తున్నాయి.