Stock Market: వారాంతంలో స్టాక్ మార్కెట్లో లాభాల జోష్.. కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల లాభం..
ABN , Publish Date - Oct 18 , 2024 | 03:33 PM
దేశీయ స్టాక్ మార్కెట్లో నేడు (శుక్రవారం) బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ సహా బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా భారీ లాభాలతో ముగిశాయి. దీంతో మదుపర్లు పెద్ద ఎత్తున లాభాలను దక్కించుకున్నారా. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్(stock market) సూచీలు వారాంతంలో (అక్టోబర్ 18న) భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ ప్రారంభ నష్టాల నుంచి కోలుకుని ఇటీవల పతనం తర్వాత గ్రీన్‌లో ట్రేడయ్యాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3.30 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 218 పాయింట్లు పెరిగి 81,224 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 24,854 స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 805 పాయింట్లు పెరిగి 52094 వద్ద ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 183 పాయింట్లు లాభపడి 58649 స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నిన్న భారీగా నష్టపోయిన మదుపర్లు ఈరోజు నష్టాల నుంచి బయటపడి కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల రూపాయలు దక్కించుకున్నారు.
టాప్ 5 స్టాక్స్
ఈ క్రమంలో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, నెస్లే, HUL కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఐషర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని 30 విభాగాల్లో 10 స్టాక్‌లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఇక నిఫ్టీ 50లోని 32 షేర్లు గ్రీన్‌లో ట్రేడ్ అయ్యాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లలో ఐటి ఇండెక్స్ (1.25 శాతం క్షీణత), ఎఫ్‌ఎంసీజీ (0.45 శాతం తగ్గుదల), ఆయిల్ & గ్యాస్ (0.19 శాతం తగ్గుదల) టాప్ డ్రాగ్‌లుగా ఉన్నాయి. వీటికి విరుద్ధంగా నిఫ్టీ బ్యాంక్ 1.64 శాతం పెరిగింది.
61 శాతం
ఆటో, ఫార్మా, హెల్త్‌కేర్, రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ కూడా గ్రీన్‌లో ట్రేడయ్యాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.38 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 0.11 శాతం పుంజుకుంది. ఇక ప్రధాన సంఘటనల్లో ZEE ఎంటర్‌టైన్‌మెంట్ Q2 ఫలితాలు ఆశాజనంగా ఉన్నాయి. ఇవి 61% జంప్ చేశాయి. శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్ స్ప్లిట్ ప్రతిపాదనను అక్టోబర్ 25న పరిశీలించనుంది. నిఫ్టీ ఐటీ టాప్ సెక్టార్ లూజర్‌గా ఉంది. మూడీస్ మొదటిసారి Baa3 రేటింగ్‌లను బజాజ్ ఫైనాన్స్‌కి కేటాయించింది.
క్రిప్టోకరెన్సీ కూడా
RBI నియంత్రణల తర్వాత మణప్పురం ఫిన్ టెక్ సంస్థ 15% లోయర్ సర్క్యూట్‌ను తాకింది. విప్రో ఊహించిన దాని కంటే Q2లో 5% ర్యాలీ చేసింది. యాక్సిస్ బ్యాంక్ షేర్లు 18% YoY Q2 PAT వృద్ధిపై 3% లాభపడ్డాయి. క్యూ2 షో తర్వాత ఇన్ఫోసిస్ షేర్లు 2% పైగా పడిపోయాయి. FMCG, IT, చమురు & గ్యాస్ వాణిజ్యం మినహా అన్ని రంగాల స్టాక్స్ గ్రీన్ లో ముగిశాయి. క్రిప్టోకరెన్సీ మార్కెట్లు శుక్రవారం పుంజుకున్నాయి. బిట్‌కాయిన్ $67,869కి చేరుకుంది. Dogecoin 10.6% పెరిగింది. ఇదే సమయంలో Ethereum, Solana కూడా లాభపడ్డాయి. దీంతో ప్రపంచ మార్కెట్ క్యాప్ 0.9% పెరిగి 2.33 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఇవి కూడా చదవండి:
Lay Offs: మళ్లీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో లే ఆఫ్స్.. భయాందోళనలో టెకీలు..
Firecracker Insurance: ఫైర్‌క్రాకర్స్‌తో గాయపడితే ఇన్సూరెన్స్ పాలసీ.. ఫోన్ పే నుంచి కొత్త స్కీం..
Gold Investment: ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్.. వీటిలో ఏ పెట్టుబడి బెస్ట్
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More Business News and Latest Telugu News