Share News

Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:25 PM

దీపావళి కోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఈ పండుగ సామాన్య ప్రజలకే కాకుండా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారికి కూడా చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్‌లో ముహూరత్ ట్రేడింగ్ చేసే సంప్రదాయం ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..
Diwali Muhurat Trading 2024

దేశీయ స్టాక్ మార్కెట్‌లో (stock market) ప్రతి ఏటా ఒక అరుదైన సంప్రదాయం కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం దీపావళి రోజున స్టాక్ మార్కెట్ మూసివేయబడుతుంది. కానీ సాయంత్రం మాత్రం కొన్ని గంటలపాటు మార్కెట్ తెరవబడుతుంది. సెన్సెక్స్, నిఫ్టీలు ప్రత్యేకంగా ఒక గంట పాటు ట్రేడింగ్ నిర్వహించుకునేందుకు అనుమతిస్తాయి. దీపావళి రోజు సెలవుదినం అయినప్పటికీ, ప్రత్యేకంగా మార్కెట్ సాయంత్రం ఒక గంట నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను ముహూరత్ ట్రేడింగ్ అని పిలుస్తారు. ఈ సంప్రదాయం 68 ఏళ్లుగా కొనసాగుతుండటం విశేషం.


ఈసారి మాత్రం

అయితే ఈసారి అక్టోబర్ 31 దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో అక్టోబర్ 31న లేదా నవంబర్ 1న తేదీలలో ఏ రోజు ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారని ముదుపర్లు చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఈ క్రమంలో NSE, BSE ఈ ట్రేడింగ్ సమయాన్ని ప్రకటించాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈసారి ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ నవంబర్ 1న సాయంత్రం 6:00 నుంచి 7:00 గంటల మధ్య నిర్వహించనున్నట్లు ప్రకటించారు.


పెట్టుబడులు చేస్తే

ఈ సమయంలో ట్రేడింగ్ చేసిన వారికి పెట్టుబడులు శ్రేయస్సును తెస్తాయని, ఏడాది పొడవునా పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని మదుపర్ల భావిస్తారు. ఈ ట్రేడింగ్ ఈక్విటీ, ఫ్యూచర్, ఆప్షన్, కరెన్సీ, కమోడిటీ మార్కెట్లలో జరుగుతుంది. ముహూర్తపు ట్రేడింగ్ ప్రీ ఓపెనింగ్ సెషన్ నవంబర్ 1న సాయంత్రం 5.45 నుంచి 6 గంటల వరకు తెరిచి ఉంటుందని జారీ చేసిన నివేదికలో పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు పెట్టుబడి ప్రారంభించడానికి ఈ రోజును చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ముహూర్తపు ట్రేడింగ్ సమయంలో చాలా మంది తమ పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయని నమ్ముతారు. ఈ సమయంలో షేర్లు కొనడం, అమ్మడం శుభపరిణామంగా ప్రజలు భావిస్తారు.


ఎప్పటి నుంచి ఈ సంప్రదాయం..

ఈ ముహూర్తపు సంప్రదాయం దాదాపు 5 దశాబ్దాల నాటి నుంచి కొనసాగుతోంది. ఈ సంప్రదాయం 1957 నుంచి BSEలో ప్రారంభమైంది. NSEలో 1992 నుంచి ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ ట్రేడింగ్‌లో మదుపర్లు ఎక్కువగా చిన్న చిన్న మొత్తాలలో పెట్టుబడులు చేస్తుంటారు.

ఎక్కువ కాలం

ముహూర్త ట్రేడింగ్ సమయంలో పెట్టుబడిదారులు, బ్రోకర్లు తరచుగా విలువ ఆధారిత స్టాక్‌లను కొనుగోలు చేస్తారు. ఇవి దీర్ఘకాలికంగా మంచివిగా పరిగణించబడతాయి. దీపావళి రోజున కొనే షేర్లు అదృష్టమని, తర్వాతి తరం వరకు ఎక్కువ కాలం ఉంచుకోవచ్చని భావిస్తారు. కొత్త పనిని ప్రారంభించడానికి దీపావళి శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందుకే చాలా మంది ఈ రోజున స్టాక్ మార్కెట్లో తమ మొదటి పెట్టుబడిని చేస్తుంటారు.


ఇవి కూడా చదవండి:

Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..

Missed Call: మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ మిస్డ్ కాల్ ఇచ్చి ఇలా చెక్ చేసుకోండి..


Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..



Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 21 , 2024 | 03:27 PM