Home » Sunday
నాలుగువేల కిలోమీటర్ల దూరం... ఆరునెలల పాటు ఏకధాటిగా పరుగు... తన ఇంటిని చేరుకోవడానికి ఒక కుక్క చేసిన సాహసం. ఆ కుక్క పేరు బాబీ. వందేళ్లు గడిచినా అక్కడి ప్రజలు ఇంకా బాబీ సాహసాన్ని, యజమానిపై దానికున్న ఇష్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
‘‘..జాగ్రత్త.. జాగ్రత్త..మెల్లగా దించండి..’’ జాకీ డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు సోదరులు ఇయాన్, స్టువర్ట్ పాటన్. వారి యాభై ఏళ్ల కల అది! అందుకే అంత టెన్షన్. ఇంతకూ విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే అతి పెద్ద గుమ్మడికాయను పండించి రికార్డు బద్దలుకొట్టాలన్నది సోదరుల లక్ష్యం.
తిరుమల ప్రసాదాలు అనేకం క్రీ.శ. 830 నుంచి ఉనికిలో ఉన్నట్టు శాసనాధారాలున్నా, ప్రస్తుతం ఉన్న రూపంలోని లడ్డూ ప్రస్తావన మాత్రం 1940ల నుంచే ఉంది. అంతకు మునుపు బూందీ రూపంలో ప్రసాదంగా ఉండేది.
విరాజు వత్సవాయి నీలాద్రిరాజ కవి పద్యం ఇది. 1971మార్చి భారతిలో నిడదవోలు వెంకటరావుగారు దీన్ని ఉదహరించారు. మనోహరమైన మొగలి పూలరేకుల పరిమళభరిత వంటకాలకన్నా కొవ్వుపోలున్న మాంసాన్ని మర్రిపండ్లతో ఉడికించి, ఆగాకర ముక్కలు వేసి వండిన కూర రాచవారికి రాజభోజనం...ట! ఆగాకర, దొండ, ఆదొండ, వేదొండ కాయలు మెండుగా దొరికే ఊరు నివాస యోగ్యం అని సూక్తి. ‘కకారాష్టక ఫలా’లని 8 రకాల కాయగూరలున్నాయి.
ఎముకలు విరిగినప్పుడు అవి అతుక్కోవడానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి బోన్ సూప్స్ కొంత ఉపయోగపడతాయి. బోన్ సూప్స్‌లో ప్రొటీన్స్, కాల్షియం లభిస్తాయి. వీటితో పాటు కొల్లాజెన్, హైల్యూరోనిక్ యాసిడ్, గ్లూకోసమీన్ మొదలైన పదార్థాలు కూడా బోన్ సూప్‌లో పుష్కలం.
ఉత్తర యూరోప్‌లోని సార్వభౌమ సమూహ దేశాలవి. ఎంత పురాతనమైనవో, అంత ఆధునికమైనవి కూడా. ‘నార్డిక్’ దేశాలుగా పిలిచే డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ వంటి స్వయం ప్రతిపత్తి ప్రాంతాల్లో పర్యటన తప్పకుండా వినూత్న అనుభవాన్నే అందిస్తుంది. ఆ విశేషాలే ఇవి...
శక్తి స్వరూపిణి జగజ్జనని శక్తి స్వరూపిణి అయిన జగజ్జనని ఈ జగమంతా అనేకానేక రూపాలలో వుంటుంది. వాటిలో కొన్ని రూపాలకు విశేష చరిత్ర వుంది. మరికొన్ని రూపాలను సాధకులు తమ సాధనలు, కోరికలు త్వరగా ఫలించేందుకు ఎంచుకుని పూజలు చేస్తుంటారు.
ఎక్సర్సైజ్ బాల్... ఫిట్నెస్ కోసం సరిగా వినియోగించుకుంటే ఈ బంతి ఓ ఫిజియో థెరపిస్టును మరిపిస్తుంది. ఓ కోచ్‌లా సహాయపడుతుంది. ప్రస్తుతం నగరాల్లో అనేక పేర్లతో కసరత్తులు చేయిస్తోంది.
ఒక నగరం లేదా గ్రామం ‘ఉత్తమ’ంగా నిలిచిందంటే అందులో సమ్‌థింగ్ స్పెషల్ ఉన్నట్టే కదా. రాజస్థాన్‌లోని ‘దేవ్‌మాలీ’ అనే గ్రామం వైపు ఇప్పుడు అంతా దృష్టి సారించారు. ఎందుకంటే... ఇటీవల అది దేశంలోనే ‘ఉత్తమ పర్యాటక గ్రామం’గా ఎంపికైంది. నవంబర్ 7న కేంద్రప్రభుత్వం నుంచి ‘ఇండియాస్ బెస్ట్ టూరిస్ట్ విలేజ్’ అవార్డు అందుకోనుంది.
కొన్నిసార్లు చేపలన్నీ బంతిలా మారి, సంఘటితంగా ఈదుతాయి. సముద్రం అడుగున ఈ బంతి చేపల్ని గుటుక్కున మింగాలని ప్రయత్నిస్తున్న తిమింగలం ఫొటో తీసి ఈ ఏడాదికి ‘బెస్ట్ ఓషన్ ఫొటోగ్రాఫర్’ అవార్డు అందుకున్నాడు రఫేల్ ఫెర్నాండెజ్. ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మెక్సికోలోని సముద్రంలో ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు.