Home » Sunrisers Hyderabad
ఐపీఎల్ 2024(IPL 2024)లో ఇటివల జరిగిన 18వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య హైదరాబాద్ జట్టు చెన్నైపై గెలిచింది. కానీ ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఓ అభిమాని మాత్రం నిరాశకు గురయ్యాడు.
ఐపీఎల్ 2024 అభిమానులను అలరిస్తోంది. బ్యాటర్ల బౌండరీల వరద, బౌలర్ల వికెట్ల వేట, ఫీల్డర్ల విన్యాసాలు అభిమానులకు ఫుల్ మజా పంచుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘనవిజయం సాధించింది. వన్ సైడేడ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చెన్నైని సన్‌రైజర్స్ చిత్తు చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. సొంత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో సత్తా చాటిన హైదరాబాద్ బలమైన చెన్నైసూపర్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బౌలర్లు చెన్నైసూపర్ కింగ్స్‌ను 165 పరుగులకే కట్టడి చేశారు.
ఐపీఎల్ 2024లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టును నిన్న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో SRH 6 వికెట్ల తేడాతో ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్ SRH గెలవడంతో ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్(Kavya Maran) ఆనందంలో మునిగిపోయారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ షురూ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ సారధ్యంలోని చెన్నైకి బ్యాటింగ్ అప్పగించాడు.
నేడు ఐపీఎల్ 2024(IPL 2024)లో కీలకమైన 18వ మ్యాచ్ నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. అయితే ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓడిన సన్ రైజర్స్ సొంత మైదానంలో ఇది జరగనున్న క్రమంలో అందరి దృష్టి కూడా ఈ మ్యాచ్‌పైనే ఉంది.
ఇప్పటికే విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఈ సీజన్లో సీఎస్కే తమ తర్వాతి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో సునాయసంగా 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్లు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మాత్రం తడబడ్డారు. గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో కనీసం ఒక బ్యాటర్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సన్‌రైజర్స్ స్టార్ ఆల్‌రౌండర్, శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం ఎడమ కాలి మడమ (చీలమండ) గాయంతో హసరంగ బాధపడుతున్నాడు.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.