Kavya Maran: CSKపై SRH గ్రాండ్ విక్టరీ.. కావ్య మారన్ రియాక్షన్ చుశారా?
ABN , Publish Date - Apr 06 , 2024 | 07:43 AM
ఐపీఎల్ 2024లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టును నిన్న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో SRH 6 వికెట్ల తేడాతో ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్ SRH గెలవడంతో ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్(Kavya Maran) ఆనందంలో మునిగిపోయారు.
ఐపీఎల్ 2024(ipl 2024)లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టును నిన్న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో SRH 6 వికెట్ల తేడాతో ఏకపక్షంగా విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇక 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 18.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సులువుగా టార్గెట్ పూర్తి చేసింది.
అయితే ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)పై ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో SRH నాలుగు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లతో (రెండు విజయాలు, రెండు ఓటములు) పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుంది. అదే సమయంలో CSK నాలుగు గేమ్‌లలో నాలుగు పాయింట్లతో అధిక నెట్ రన్ రేట్ కారణంగా మూడో స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్ SRH గెలవడంతో ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్(Kavya Maran) ఆనందంలో మునిగిపోయారు. ఆ క్రమంలో ఆమె బృందం ప్రదర్శించిన తీరుకు చప్పట్లు కొడుతూ సంతోషంతో కనిపించారు. సొంత మైదానంలో రెండో విజయం సాధించడం పట్ల ఆమెతోపాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. మరోవైపు SRH కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins)పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
IPL 2024 - Revanth Reddy: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి.. పక్కనే స్టార్ తెలుగు హీరో
మరిన్ని క్రీడా వార్తల కోసం