Home » Supreme Court
‘‘కేసును విచారించే కోర్టు మారినా.. విషయం మారదు కదా?’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం పైవిధంగా స్పందించింది.
క్రిమినల్ కేసుల్లో నిందితులైనంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చివేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.
పంట ఉత్పత్తుల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో శంభూ సరిహద్దులో ఏడాది కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులతో చర్చల కోసం సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.
పశ్చిమ్ బంగా ఛాత్ర సమాజ్ నాయకుడు సయాన్ లాహిరి బెయిల్‌ను సవాల్ చేస్తూ బెంగాల్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆప్ నేత విజయ్ నాయర్‌కు బెయిల్ మంజూరైంది. సుమారు 23 నెలల పాటు జైలులో ఉన్న నాయర్.. పీఎల్‌ఎంఏ కేసులో బెయిల్ కోసం గత నెల 12న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
'బుల్డోజర్ న్యాయం' పై సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ తెలిపింది. ఒక కేసులో నిందితులైనంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ కు సుప్రీంకోర్టు సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సుమారు 100 రోజుల పాటు జైలులో కుమార్ ఉన్నారు.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఈడీ కేసులో 'ఆమ్ ఆద్మీ పార్టీ' మాజీ ఆఫీస్ బేరర్ విజయ్ నాయర్ కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఈ కేసులో 23 నెలలుగా తీహార్ జైలులో ఉన్న నాయర్‌కు అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case).. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ మొదలుకుని గల్లీ వరకూ ఎన్ని అరెస్టులు జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇలా పెద్ద తలకాయలు అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాలు హీటెక్కాయి..
కక్షిదారులకు సత్వర న్యాయం అందాలంటే కోర్టుల్లోని ‘వాయిదాల సంస్కృతి’ని మార్చాల్సి ఉందని ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు.