Home » Tadipatri
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ రోజు.. ఆ మరుసటి రోజు తాడిపత్రి నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే. ఈ గొడవల నేపథ్యంలో భద్రతకు వచ్చిన పోలీసులకు చుక్కలు కనపడుతున్నాయ్..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనలను అదుపు చేసేపేరిట కడప జిల్లా రాజంపేట డీఎస్పీ చైతన్య ఎవరు రప్పించారనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. జిల్లాలోని పలువురు పోలీసు అధికారులను సిట్ సభ్యులు శ్రీనివాస్, భూషణం, శ్రీనివాసులు ఈ విషయమై ప్రశ్నిస్తున్నా.. స్పష్టమైన సమాధానం రావడంలేదని తెలిసింది. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్.. తాడిపత్రిలో దర్యాప్తు కొనసాగిస్తోంది. వివాదాస్పద డీఎస్పీ చైతన్య గురించి పలువురు పోలీసు అధికారులను సిట్ బృందం బుధవారం విచారించినట్లు సమాచారం. తాడిపత్రిలో పనిచేసే సమయంలో వైసీపీ నాయకులతో అంటకాగిన డీఎస్పీ చైతన్యను ఎన్నికల అల్లర్ల సమయంలో ఎందుకు రమ్మన్నారు? అని సూటిగా...
ఏపీ ఎన్నికల సంఘానికి (Election Commission) తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మరోసారి ఫిర్యాదు చేసింది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీపకర్ రెడ్డి బుధవారం లేఖ రాశారు.
మా పార్టీ అధికారంలోకి వస్తే మేము సేఫ్. లేదు లేదు గెలిచేది మా పార్టీనే. కాబట్టి మాకేం కాదు. ఇదీ పట్టణంలో జరిగిన రాళ్లదాడిలో పాల్గొని, అజ్ఞాతంలో ఉన్న ఇరుపార్టీల వారి ధీమా. సార్వత్రిక ఎన్నికల రోజున పట్టణంలోని ఓంశాంతినగర్, పాతకోట ప్రాంతాల్లో రాళ్లదాడులు జరిగిన 24గంటల్లోనే మరోసారి వైసీపీ శ్రేణులు పట్టణంలోని గానుగవీధిలోని టీడీపీ సీనియర్ నాయకుడు సూర్యముని ఇంటి సమీపంలో రాళ్లవర్షం కురిపించారు. అయితే ఈ ఘటనలకు ఎలాంటి సంబంధం లేని ఇరువర్గాల వారిని కూడా పోలీసు ఉన్నతాధికారులు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. దీంతో ఇప్పటికే ద్వితీయశ్రేణి ...
సార్వత్రిక ఎన్నికల తరువాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల (AP Elections) ముందు.. ఆ తర్వాత జరిగిన అల్లర్లు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 144 సెక్షన్ అమలు చేయడంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. మరోవైపు.. ఈ అల్లర్ల ఘటనపై విచారణ చేసేందుకు తాడిపత్రికి సిట్ అధికారుల బృందం విచ్చేసింది. శాంతిభద్రతల దృష్ట్యా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ను పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలు రణరంగంగా మారిన పరిస్థితి. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్రజేసి ఆయా జిల్లాల ఎస్పీలు, పలువురు పోలీసు ఉన్నతాధికారులపై వేటు వేసింది.
తాడిపత్రి అల్లర్లను అరికట్టడంలో విఫలమైనందుకు ఎస్పీ అమిత బర్దర్పై సస్పెన్షన వేటు పడింది. తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక చర్యలను అరికట్టడంలో విఫలమైనందుకు ఎన్నికల కమిషన చర్యలు తీసుకుంది. ఆయనతోపాటు తాడిపత్రి డీఎస్పీ సీఎం గంగయ్య, సీఐ ఎస్.మురళీకృష్ణను సస్పెండ్ చేసింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ...
భారీ భద్రత మధ్య తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు.
తాడిపత్రిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు టార్గెట్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఫ్యామిలీ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.