Home » TATA Group
అంతర్జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించి, తన సంపాదనలో 60 శాతానికిపైగా పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ నావల్ టాటా(86) బుధవారం రాత్రి మరణించారు.
సీనియర్ పారిశ్రామికవేత్త రతన్ నావల్ టాటా మృతికి భారత్‌తోపాటు అనేక మంది అమెరికా అగ్రనేతలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా కీలక ప్రకటనలు చేశారు.
దేశంలో టాటా గ్రూప్ గురించి అనేక మందికి తెలుసు. అయితే ఈ గ్రూప్ నడుపుతున్న రతన్ టాటాకి ఎంత ఆస్తి ఉందో తెలుసా. ఈ సంస్థ మొత్తం ఆస్తుల విలువ ఎంత అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు సంతాపం ప్రకటించారు. రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటని.. భారత పారిశ్రామిక రంగానికే కాదు.. ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ గ్రహీత రతన్ టాటా(Ratan Tata) ఇక లేరు. ఈ నేపథ్యంలో రతన్ టాటా మృతి పట్ల దేశవ్యాప్తంగా సంతాపం వెల్లువెత్తుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ సహా ప్రముఖులు సంతాపం తెలిపారు.
తాను ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చానని, ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెంది.. పుకార్లు వ్యాప్తి చేయవద్దని సూచించారు. సరిగ్గా ఆయన పోస్టు చేసిన మూడు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన లాస్ట్ పోస్టు..
ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేయడమే కాకుండా ప్రతి వ్యక్తి హృదయంలో చోటు సంపాదించారు. వ్యాపారం చేసి సంపాదించడమే కాదు. సంపాదనలో ఎక్కువ భాగాన్ని సేవా కార్యక్రమాలకు విరాళాలుగా ఇచ్చిన వ్యక్తి రతన్ టాటా. ఆయనలో గొప్ప మానవతావాది కనిపిస్తారు. పోటీ ప్రపంచంలో వేరే వాళ్లను తొక్కి తాను ఎదగాలని ఎప్పుడూ..
మానవతావాది రతన్ టాటా మృతి భారత పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించానని.. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా సినీరంగంలోనూ కాలుపెట్టారు. అమితాబ్ బచ్చన్ నటించిన ఏత్బార్ అనే సినిమాకు ఆయన సహనిర్మాతగా వ్యవహరించారు.
రతన్ టాటా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే రతన్ టాటా మృతి సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించి అనేక కథలు చాలానే ఉన్నాయి. కానీ విదేశాల్లో స్థిరపడాలని అనుకున్న క్రమంలో భారత్ ఎందుకు వచ్చారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఎంటనేది ఇక్కడ తెలుసుకుందాం.