Share News

Ratan Tata: రతన్ టాటా‌ సమస్య ఏంటి? కీలక అవయవాలను డ్యామేజ్ చేసిన ఆ వ్యాధి లక్షణాలేంటి..

ABN , Publish Date - Oct 11 , 2024 | 04:21 PM

రతన్ టాటా కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కూడా. ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆకాశమే హద్దుగా విస్తరించారు. అలాగే దాతృత్వంలో తనకు సాటి లేదని నిరూపించారు. మన దేశంలో ప్రతి రోజు ఎన్నో కోట్ల మంది ఏదో ఒక టాటా ఉత్పత్తిని వాడుతూనే ఉంటారు.

Ratan Tata: రతన్ టాటా‌ సమస్య ఏంటి? కీలక అవయవాలను డ్యామేజ్ చేసిన ఆ వ్యాధి లక్షణాలేంటి..
Ratan Tata

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) మరణ వార్తతో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. రతన్ టాటా కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కూడా. ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆకాశమే హద్దుగా విస్తరించారు. అలాగే దాతృత్వంలో తనకు సాటి లేదని నిరూపించారు. మన దేశంలో ప్రతి రోజు ఎన్నో కోట్ల మంది ఏదో ఒక టాటా ఉత్పత్తిని వాడుతూనే ఉంటారు. ఉన్నత విలువలతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిన రతన్ టాటా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చివరకు ప్రాణాలు కోల్పోయారు (Ratan Tata Death).


ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రతన్ టాటా ఆరోగ్యంలో మెరుగుదల కనిపంచలేదు. వయసుతో పాటు తలెత్తే సమస్యలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. రతన్ టాటాకు చికిత్స అందించిన డాక్టర్ షారుఖ్ అస్పి గోల్వాలా ప్రకారం.. రతన్ టాటా హైపోటెన్షన్ (లో బీపీ)తో బాధపడుతున్నారు. రక్తపోటు తక్కువగా ఉండడం (Low blood pressure) అనే వ్యాధి కారణంగా రతన్ టాటా శరీరంలోని చాలా అవయవాలు క్రమంగా పనిచేయడం మానేశాయి. దానికి తోడు రతన్ టాటాకు డీహైడ్రేషన్ (Dehydration) సమస్య కూడా మొదలైంది. వయసు మీరిన వారికి ఇది మరింత పెద్ద సమస్యగా మారుతుంది.


రక్తపోటు 90/60 కంటే తక్కువగా ఉంటే దానిని లో బీపీగా పరిగణిస్తారు. బీపీ తక్కువగా, ఉన్నా, ఎక్కువగా ఉన్నా సమస్య మొదలవుతుంది. లో బీపీతో బాధపడుతున్న వృద్ధులలో గుండె, మెదడు, ఇతర అవయవాలకు రక్త ప్రసరణ తగ్గడం ప్రారంభమవుతుంది. అకస్మాత్తుగా బీపీ తగ్గినప్పుడు, మెదడుకు రక్తం, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. అలాంటి సమయంలో తల తిరగడం, తలనొప్పి, కొన్నిసార్లు మూర్ఛ వంటి సమస్యలు సంభవించవచ్చు. లేచి నిలబడినపుడు తల తిరిగినట్టు అనిపిస్తుంది. అలాంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Updated Date - Oct 11 , 2024 | 05:03 PM