Share News

Ratan Tata: రతన్ టాటా ఆస్తి ఎవరికి.. వీలునామాలో ఏముందంటే

ABN , Publish Date - Oct 25 , 2024 | 06:31 PM

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, దివంగత రతన్ టాటా(Ratan Tata) మరణించాక ఆయన ఆస్తులు ఎవరికి వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది. మార్కెట్ పరంగా టాటా కంపెనీ విలువ రూ.30 లక్షల కోట్లకుపైనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Ratan Tata: రతన్ టాటా ఆస్తి ఎవరికి.. వీలునామాలో ఏముందంటే

ఇంటర్నెట్ డెస్క్: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, దివంగత రతన్ టాటా(Ratan Tata) మరణించాక ఆయన ఆస్తులు ఎవరికి వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది. మార్కెట్ పరంగా టాటా కంపెనీ విలువ రూ.30 లక్షల కోట్లకుపైనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టాటా సంస్థలను అంత ఎత్తుకు చేర్చడానికి ఆయన ఎన్నో ఏళ్ల కృషి దాగి ఉంది. దశాబ్దాల పాటు సంస్థకు నేతృత్వం వహించి సంస్థను విస్తరించారు. టాటా గ్రూప్ ఆయన నేతృత్వంలో ఎన్నో కార్యకలాపాలు ప్రారంభించి, లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలను సృష్టించింది. అయితే రతన్ టాటా మరణానంతరం టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటాను నియమించారు.


అయితే రతన్ టాటా ఆస్తులు ఎవరికి వెళ్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. రతన్ టాటా తన సంపదలో పెద్ద మొత్తంలో ఎక్కువగా విరాళాలకే కేటాయించారు. దాంతోపాటు ట్రస్టులకు రాసిచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. రతన్ టాటాకు రూ.10 వేల కోట్ల ఆస్తి ఉంది. అలీబాగ్‌లో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బీచ్ బంగ్లా ఉంది. ముంబయి జుహూ తారా రోడ్ దగ్గర 2 అంతస్థుల భవనం ఉంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ. 350 కోట్లకుపైనే ఆస్తులున్నాయి. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌లో 0.83 శాతం వాటా రతన్ టాటాకు ఉంది. సంపదలో ఎక్కువ భాగం ఎండోమెంట్ ఫౌండేషన్‌కు బదిలీ చేయించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.


శునకానికి ఆస్తి..

రతన్ టాటాకు శునకాలు అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పెంపుడు శునకం జర్మన్ షెఫర్డ్ టిటోకు 'అన్‌లిమిటెడ్ కేర్' పేరుతో వీలునామాలో ప్రత్యేక నిబంధనలు రూపొందించారట. ఈ శునకం బాధ్యతలను వంటమనిషి రాజన్ షా చూసుకుంటున్నారు. అయితే టిటోతోపాటు బట్లర్ సుబ్బయ్య, వంట మనిషి రాజన్ షాలకు టాటా.. తన ఆస్తిలో కొంత భాగాన్ని ఇవ్వాలని వీలునామాలో రాశారట. ఇక రతన్ టాటా ఆత్మీయుడైన శాంతను నాయుడుకు కూడా కొంత మొత్తం ఇవ్వాలని రతన్ టాటా అనుకున్నట్లు తెలుస్తోంది.


వీరితోపాటు టాటా ఫౌండేషన్, సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరులు షిరీన్, డీనా జెజీబోయ్ సహా ఇంట్లో సిబ్బందికి వాటాలు కట్టబెట్టారట. వీధి శునకాల సంరక్షణ కోసం టాటా ఎంతగానో తపించేవారు. మూగజీవాల కోసం ఆసుపత్రులు కట్టించారు. దేశా ఆర్థిక రాజధాని ముంబయిలో ఐదు అంతస్తుల భవనంలో ‘పెట్‌ ప్రాజెక్ట్‌’ పేరుతో శునకాల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అలా.. ఇంట్లో పని చేసే వారి నుంచి రక్త సంబంధీకులు, చివరకు తనకిష్టమైన శునకం వరకు వాటాలు పంచేశారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

Bandi Sanjay: ఇంతకంటే కాస్ట్‌లీ ప్రాజెక్టు.. కాస్ట్ లీ స్కామ్ ఎక్కడా లేదేమో

Kishan Reddy: రేవంత్ నీ సవాల్‌ను స్వీకరిస్తున్నా.. అందుకు మేము సిద్ధమే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 25 , 2024 | 06:31 PM