Share News

Ratan Tata: ప్రపంచం విలువైన రత్నాన్ని కోల్పోయింది.. ఎన్నారై టీడీపీ సంతాపం

ABN , Publish Date - Oct 11 , 2024 | 07:21 AM

రతన్ టాటా మృతి కేవలం దేశానికే కాదని ప్రపంచానికి తీరని లోటని కోమటి జయరాం తెలిపారు. విలువలకు, నీతి నిజాయితీకి రతన్ టాటా నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆయనలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని తెలిపారు. తన ఆదాయంలో సగానికిపైగా సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ద్వారా..

Ratan Tata: ప్రపంచం విలువైన రత్నాన్ని కోల్పోయింది.. ఎన్నారై టీడీపీ సంతాపం

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతిపై ఎన్నారై టీడీపీ సంతాపం వ్యక్తం చేసింది. ప్రపంచం ఒక విలువైన రత్నాన్ని కోల్పోయిందని ఎన్నారై టీడీపీ కన్వీనర్ కోమటి జయరాం తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మృతి కేవలం దేశానికే కాదని ప్రపంచానికి తీరని లోటని తెలిపారు. విలువలకు, నీతి నిజాయితీకి రతన్ టాటా నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆయనలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని తెలిపారు. తన ఆదాయంలో సగానికిపైగా సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ద్వారా ప్రజల మనసులో రతన్ టాటా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని కోమటి జయరాం పేర్కొన్నారు.


భూరి విరాళాలు..

రతన్ టాటా ఎప్పుడూ ప్రచారాన్ని కోరుకోలేదని, తాను సాయం చేసిన విషయం మూడో వ్యక్తికి తెలియకుండా కోట్ల రూపాయలను దానం చేశారని కొనియాడారు. విద్యాసంస్థలకు, సాంకేతిక సంస్థలకు, క్యాన్సర్ ఆసుపత్రులకు భూరి విరాళాలు ఇచ్చారని పేర్కొన్నారు. మద్రాస్ ఐఐటి, బొంబాయి ఐఐటిలతో పాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌కు ఎంతో ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హర్వర్డ్ బిజినెస్ స్కూల్‌తో పాటు ఇతర ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు భారీగా విరాళాలు ఇచ్చారన్నారు. విదేశాల్లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థులకు నేరుగా ప్రవేశం లభించాలన్నదే రతన్ టాటా లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఖరీదైన వస్తువులను ప్రతి పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లోకి తీసుకువచ్చేందుకు రతన్ టాటా ప్రయత్నించారన్నారు. ఆయనలో ఎల్లప్పుడూ ప్రజాకోణం కనిపించేదన్నారు. రతన్ టాటా గొప్ప మానవతావాదని కొనియాడారు. కోట్ల రూపాయిలు సాయం చేసినా ప్రచారం చేసుకునేవారు కాదని, ప్రతి వ్యక్తికి సమాన విలువ ఇచ్చేవారని పేర్కొన్నారు. రతన్ టాటా మృతి ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసిందన్నారు.


రతన్ టాటా అందించిన సేవలను గుర్తుచేసుకున్న ఎన్నారై టీడీపీ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఎన్నారై టీడీపీ నాయకులు, వయాపారవేత్త గుళ్ళపల్లి రామకృష్ణ సంతాపం తెలియజేస్తూ విజయవాడ పార్లమెంట్ పరిధిలో టాటా ట్రస్టు సేవలను గుర్తుచేసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 11 , 2024 | 07:21 AM