Home » TATA IPL2023
దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ తర్వాత ఆ స్థాయిలో మైదానం నలువైపులా షాట్లు కొట్టగల ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఈ ఏడాది ఆరంభంలో ఫామ్ కోల్పోయి తంటాలు పడినప్పటికీ ప్రస్తుత ఐపీఎల్‌లో మళ్లీ మునపటి సూర్యను తలపిస్తున్నాడు.
ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆ టీమ్ కెప్టెన్ ధోనీకి చెన్నైలోనే కాదు.. ఎక్కడ ఆడితే అక్కడ భారీ మద్దతు లభిస్తోంది.
ప్లే-ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సత్తా చాటింది. సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
క్రికెట్ అనేది ఓ టీమ్ స్పోర్ట్. ఈ ఆటలో వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టుగా గెలవడానికే అందరూ ప్రయత్నిస్తారు. సోమవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్ రహ్మనుల్లా గుర్భాజ్ తీసుకున్న ఓ నిర్ణయం విమర్శల పాలవుతోంది.
ఈ ఐపీఎల్‌లో కోల్‌కతా టీమ్ ఒక్కోసారి అనూహ్యంగా చెలరేగుతోంది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధిస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లోనూ కోల్‌కతా అదే ఫీట్‌ను రిపీట్ చేసింది.
ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు కావాల్సిన వినోదం అందించింది. అనేక మలుపులు తిరుగుతూ అభిమానుల అంచనాలకు అందకుండా సాగింది.
డ్రామా లేకపోతే సినిమాలో అయినా క్రికెట్‌లో అయినా మజా ఏముంటుంది? ఆదివారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైడ్రామా ప్రేక్షకులను మునివేళ్ల మీద నిల్చోపెట్టింది.
``క్యాచెస్ విన్ మ్యాచెస్`` అంటారు. క్యాచ్‌లే మ్యాచ్‌లను మలుపు తిప్పుతాయి. టీ-20 క్రికెట్లో అయితే క్యాచ్‌లు మరింత కీలక పాత్ర పోషిస్తాయి. ఆదివారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అత్యుత్తమ కీపర్లలో ధోనీ ఒకడు. స్టంపౌట్లు, క్యాచ్‌లు, రనౌట్లు చేయడంలో ధోనీకి సాటి వచ్చే కీపర్ భారత్‌లో అంతకు ముందు లేరు, ఆ తర్వాతా లేరనే చెప్పాలి.
ఈ నెల ఒకటో తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ పలు వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. మ్యాచ్ సమయంలో లఖ్‌నవూ బౌలర్ నవీన్-ఉల్-హక్, కోహ్లీ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.