Home » TDP - Janasena
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారుచేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 24,676 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇది ఏడోసారి.
అన్యాయంపై న్యాయం విజయకేతనం ఎగురవేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా నెల్లూరులో శనివారం ‘థ్యాంక్స్ టూ గాంధీజీ’ పేరుతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు
వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం దద్దరిల్లింది. వైసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి ఆయన వ స్తున్నారన్న సమాచారంతో టీడీపీ, జనసేన శ్రేణులు పెద్దఎత్తున నిరసనకు దిగాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టులు పూర్తి చేసి ఆయన లక్ష్యం నెరవేర్చేలా పనిచేస్తానని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఉపయోగంలేని సర్టిఫికెట్లు, నాసిరకం కిట్లు, డ్రెస్సులతో ఎన్నికల స్టంట్‌గా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలలో రూ.100 కోట్ల స్కాం జరిగిందని జాతీయ కబడ్డీ మాజీ క్రీడాకారుడు, ఆటియా-బాటియా అసోసియేషన్ రాష్ట్ర సీఈఓ రంబా ప్రసాద్ ఆరోపించారు. అనంతపురం జిల్లాకు శనివారం వచ్చిన ఆయన.. ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
మంత్రివర్గంలో నాకు కేటాయించిన శాఖలు నా మనస్సుకు, జనసేన మూలసిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆటవీ శాఖలు కేటాయించడంపై ఆయన స్పందించారు. ‘ఈ శాఖల ద్వారా ప్రజలకు నేరుగా సేవలందించే అవకాశం కలిగింది.
‘అహంకారానికి దూరంగా బాధ్యతతో పనిచేద్దాం. ఏ ఆశలు, ఆకాంక్షలతో మనల్ని గెలిపించారో వాటిని నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేద్దాం. పాలన ఎలా ఉండకూడదో జగన్ చూపించారు. ఎలా ఉండాలో మనం ఒక నమూనాగా... ఆదర్శంగా పనిచేసి చూపిద్దాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి అభివృద్ధి బాధ్యత నాది అని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తనపై పెద్ద బాధ్యత ఉంచారని వివరించారు. ఆయన నమ్మకాన్ని నిలబెడతానని తేల్చి చెప్పారు. అమరావతి నగరాన్ని ప్రపంచంలో అత్యున్నతంగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం వెనుక నాయకులు, కార్యకర్తల అలుపెరగని శ్రమ, ఆపార కృషి ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు. గత 20 ఏళ్లలో గెలవని చోట గెలిచామని, ఈ విజయం కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని ప్రకటించారు. ప్రజలు నమ్మకంతో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని వివరించారు. 93 శాతం స్ట్రైట్ రేట్‌తో 57 శాతం ఓట్ షేర్‌ను కూటమి సాధించిందన్నారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా కాలేదు. అయినాసరే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలనకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ఏపీ పాలనలో తనదైన మర్క్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు.