AP Politics: పాలనలో సంస్కరణలకు శ్రీకారం.. గతానికి.. ప్రస్తుతానికి స్పష్టమైన తేడా..
ABN , Publish Date - Jun 15 , 2024 | 02:17 PM
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా కాలేదు. అయినాసరే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలనకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ఏపీ పాలనలో తనదైన మర్క్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా కాలేదు. అయినాసరే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలనకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ఏపీ పాలనలో తనదైన మర్క్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గం కూర్పుతోనే రానున్న ఐదేళ్ల చంద్రబాబు పాలన ఎలా ఉంటుందో రుచి చూపించారని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని.. ఏ సమస్యతో వచ్చినా తక్షణమే పరిష్కరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రులు ఏ విధంగా వ్యవహరించాలో ఇప్పటికే మార్గదర్శనం చేశారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారిలో మనిషిగా సామాన్యుడిగా అందుబాటులో ఉండాలని.. ఏ మాత్రం అహంకారం, గర్వం లేకుండా పనిచేయాలని సూచించారు. గత ప్రభుత్వం ఏ పని చేసినా ఓట్ల రాజకీయం కోసం మాత్రమే చేసేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతానికి భిన్నంగా ప్రజాపాలన అందించాలని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కూటమి ఎమ్మెల్యేలంతా ఎక్కువ సమయం స్థానిక నియోజకవర్గాల్లోనే ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ సైతం నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. దీంతోతమ ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా ఉంటుందని.. ఏసీ గదులకు ఎమ్మెల్యేలు, మంత్రులు పరిమితం కారనే సందేశం ఇచ్చినట్లైంది.
TG Bharath: సమస్యలు తీరిస్తే భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది: మంత్రి టీజీ భరత్
మంగళగిరిలో ప్రజాదర్బార్..
మంగళగిరి ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గంలో ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. స్థానికంగా అందుబాటులో ఉండే రోజుల్లో ప్రజలను కలవనున్నట్లు తెలిపారు. గత వైసీపీ పాలనలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారని ప్రజలంతా ఎదురుచూశారు. అయితే గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులో ఉన్నాయని.. ఏ సమస్య ఉన్న అక్కడ ఫిర్యాదు చేస్తే సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రజలు తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని కలిసి సమస్యలు విన్నవించే పరిస్థితి లేకుండా పోయింది. ఏదైనా సమస్యలను నేరుగా తమ ఎమ్మెల్యేకు చెప్పుకుంటే త్వరగా పరిష్కారమవడంతో పాటు.. తమ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని ఆశ పడుతుంటారు. అయితే వైసీపీ ప్రభుత్వం సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో ప్రజల సమస్యలు ఎమ్మెల్యేలకు తెలిసేవి కావు. మరోవైపు కొన్ని సమస్యలు పరిష్కారమైతే.. మరికొన్నింటికి పరిష్కారం దొరికేది కాదు.. దీంతో ప్రజలకు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం మొదలైంది. వైసీపీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయానికి ఇది ఒక కారణమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
Chandrababu: ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం
ప్రజా పాలన..
గత వైసీపీ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో పూర్తిగా ఓట్ల రాజకీయానికి శ్రీకారం చుట్టిందనే విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్య దూరం పెరిగింది. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. గత అనుభవాల దృష్ట్యా నిజమైన ప్రజాపాలన అందించాలని టీడీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి ప్రతి సమస్యను సకాలంలో పరిష్కరిస్తామని కూటమి ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే వారం రోజుల్లోనే కొత్త ప్రభుత్వ పాలనలో స్పష్టమైన తేడా కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది.
Atchannaidu: విత్తనాలు, ఎరువుల కొరత రానివ్వొద్దంటూ అధికారులకు ఆదేశాలు
Chandrababu: ప్రక్షాళన ప్రారంభించిన చంద్రబాబు.. సీఎస్, డీజీపీలతో భేటీ
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News