Home » TDP - Janasena
ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని తెలుగుదేశం పార్టీ నేత, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 13వ తేదీన వైసీపీకి ప్రజలు తిరస్కరించారని వివరించారు. ఒకవిధంగా ఆ పార్టీ 13వ తేదీన చనిపోయిందని తెలిపారు. జూన్ 4వ తేదీన సీఎం జగన్ దిమ్మదిరిగే ఫలితాలు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది.. ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు. ఓటరు ఆలోచన ఎలా ఉందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఓటర్లు తమ తీర్పును రిజర్వ్ చేశారు. జూన్4న ఫలితం తేలనుంది. ఈలోపు ఏపార్టీ మెజార్టీ మార్క్ సాధిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అందరి దృష్టి కౌంటింగ్పైనే నెలకొంది. జూన్4 కోసం ఏపీ ప్రజలు నిరీక్షిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు మాత్రం ఓట్ల లెక్కింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోటీచేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామాల వారీగా లెక్కలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులు కావొస్తుంది. ఫలితాల కోసం మరో 15 రోజులు ఆగాల్సిందే. ఈలోపు గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. మరోవైపు పందేం రాయుళ్ల హడావుడి. నియోజకవర్గాలవారీ ఇప్పటికే కోట్లలో పందేలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై ఇప్పటికే వందల కోట్ల రూపాయిలు పందేలు కట్టినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు వరకు వైసీపీకి చెందిన నేతలు పందేలు కట్టేందుకు భారీగా ముందుకు రాగా.. ప్రస్తుతం సర్వే సంస్థల నుంచి వచ్చిన సమాచారం, గ్రామాల వారీ క్యాడర్ అందిస్తున్న వివరాలతో వైసీపీ నేతలు పందేలు కట్టడంలో కొంచెం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
పోలింగ్ ముగిసినప్పటికీ పల్నాడులో ప్రతీకార దాడులకు వైసీపీ మూకలు తెగబడుతూనే ఉన్నాయి.
పట్టపగలు... నడి వీధుల్లో వైసీపీ మూకలు అరాచకం సృష్టించాయి. కిరాయి రౌడీలతో కలిసి వీరంగం వేశాయి.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేయడానికి వైసీపీ ప్రయత్నం చేసిందని ఎన్డీయే కూటమి నేతలు ధ్వజమెత్తారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ...
ఏపీలో పోలింగ్ ముగిసిన వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ పోలింగ్ రోజుని రాష్ట్రంలో ఓ చారిత్రాత్మక దినంగా అభివర్ణించిన ఆయన..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ‘గేమ్ చేంజర్’గా ముద్ర పడిన జనసేన సారథి పవన్ కల్యాణ్... ‘ఒంటరిని’ అంటూ విన్యాసాలు చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి! అభ్యర్థులు ఎవరైనా, పార్టీలు వేర్వేరైనా... ఈ అగ్ర నేతలపైనే అందరి కన్ను....
నీతి నిజాయితీతో... ప్రజలకు మేలు చేయాలనే తలంపు ఉన్న నాయకులను ఎన్నుకోవాలి