Share News

Ayyanna patrudu : స్పీకర్‌ పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తా

ABN , Publish Date - Jun 30 , 2024 | 05:14 AM

స్పీకర్‌ పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తా. ఇదివరకటిలా ఏది పడితే అది మాట్లాడలేను. చంద్రబాబు నా నోటికి ప్లాస్టర్‌ వేసేశారు’ అని చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

 Ayyanna patrudu : స్పీకర్‌ పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తా

నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్‌ వేశారు: అయ్యన్న

విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి), గోపాలపట్నం, నర్సీపట్నం, జూన్‌ 29: ‘స్పీకర్‌ పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తా. ఇదివరకటిలా ఏది పడితే అది మాట్లాడలేను. చంద్రబాబు నా నోటికి ప్లాస్టర్‌ వేసేశారు’ అని చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శనివారం ఆయన విశాఖకు వచ్చారు. నగరంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, నగరానికి చెందిన వ్యాపార ప్రముఖులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన అక్కడ నుంచి నర్సీపట్నం వెళ్లారు.

అక్కడ అయ్యన్నకు పౌరస న్మానం జరిగింది. ముందుగా విమానాశ్రయంలో విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెం దిన పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. విశాఖ, నర్సీపట్నంలో అయ్య న్న మాట్లాడుతూ... ‘నాకు 40 ఏళ్ల కిందట ఎన్‌టీ రామారావు మంత్రి పదవి ఇస్తే, ఇప్పుడు సీఎం చంద్రబాబు రాష్ట్రంలోనే అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్‌ పదవిని ఇచ్చి గౌరవించారు. అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 85 మంది కొత్తవారు ఉన్నారు. వారికి సభా మర్యాద, సంప్రదాయాలతోపాటు నిబంధనలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికీ సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తా. అవసరమైతే సమావేశాలను మరో రెండు రోజులు పొడిగిస్తాం’ అని అయ్యన్న అన్నారు.

Updated Date - Jun 30 , 2024 | 05:14 AM