Home » Telangana Bhavan
హైదరాబాద్: దివ్యాంగుల పింఛన్‌పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరుగుతున్న దివ్యాంగుల కృతజ్ఞత సభలో మంత్రి మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు రూ. 2 వందల పింఛన్ ఇస్తుందని.. అదే తెలంగాణలో రూ. 4,016 ఇస్తున్నామని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియా ముఖంగా హామీలను ప్రకటించారు.
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (CM KCR) ముందు ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరిని మార్చే ఉద్దేశ్యం ఉందా?. ముందు ప్రకటించిన 115 మందిలో ఒకరు పార్టీ మారగా మిగతా 114 మందిలో అందరికీ బీ-ఫామ్స్ ఇవ్వరా?.. అనే సందేహాలకు తావిచ్చేలా సీఎం కేసీఆర్ వ్యవహరించారని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ (CM KCR) కీలక సూచనలు చేశారు. మళ్లీ విజయం మనదేనని, ఎవరూ తొందరపడొద్దని అభ్యర్థులతో అన్నారు. మొట్టమొదటిగా పార్టీలో అసంతృప్తిగా ఉన్నవారిని బుజ్జగించాలని సూచించారు. చిన్న కార్తకర్త అయినా అలిగితే వారి ఇంటికెళ్లి మాట్లాడాలని కోరారు. అహంకారానికిపోతే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌కు తెలంగాణ భవన్ వద్ద అనూహ్య పరిస్థితి ఎదురైనట్టు తెలుస్తోంది. నేడు (ఆదివారం) అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత సందర్బంగా తెలంగాణ భవన్ వద్దకు వచ్చిన ఆయనను సిబ్బంది బయటకుపించారు.