Hyderabad: చివరకు ఇలా అయిందన్నమాట... తెలంగాణ భవన్‌లో జేబు దొంగలు.. నగదు, సెల్‌ఫోన్‌లు చోరీ | Hyderabad: Finally it happened... Pickpockets in Telangana Bhavan.. Cash, cell phones were stolen. ksv
Share News

Hyderabad: చివరకు ఇలా అయిందన్నమాట... తెలంగాణ భవన్‌లో జేబు దొంగలు.. నగదు, సెల్‌ఫోన్‌లు చోరీ

ABN , Publish Date - Jan 31 , 2024 | 01:48 PM

తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో జేబు దొంగలు రెచ్చిపోయారు. ఈ నెల 27న మైనారిటీ విభాగం సమావేశం జరిగింది.

Hyderabad: చివరకు ఇలా అయిందన్నమాట... తెలంగాణ భవన్‌లో జేబు దొంగలు.. నగదు, సెల్‌ఫోన్‌లు చోరీ

బంజారాహిల్స్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో జేబు దొంగలు రెచ్చిపోయారు. ఈ నెల 27న మైనారిటీ విభాగం సమావేశం జరిగింది. పేట్లబురుజుకు చెందిన బీఆర్‌ఎస్‌ మాజీ రాష్ట్ర కార్యదర్శి జైపాల్‌రెడ్డి(Jaipal Reddy) జేబులోని రూ.50 వేల నగదు మాయమైంది. గోల్కొండకు చెందిన ఆజంఖాన్‌, ఖైరతాబాద్‌కు చెందిన శశిధర్‌ జేబులోని సెల్‌ఫోన్‌లు కనిపించకుండా పోయాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Jan 31 , 2024 | 01:48 PM