Home » Telangana High Court
దర్శకుడు ఎన్.శంకర్‌కు మోకిళ్లలో ఐదు ఎకరాల భూమిని కేటాయించడంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. దర్శకుడు ఎన్.శంకర్‌కు శంకర్‌పల్లిలోని మోకిల్లాలో ఎకరాకు ఐదు లక్షల చెప్పున ఐదు ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కరీంనగర్‌కు చెందిన జె.శంకర్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.
75 ఏళ్ల పాటు ఆదివాసీలు నిర్వహించిన పోరాటానికి నేడు ఫలితం దక్కింది. పట్టువదలని విక్రమార్కుల్లా ఆదివాసీలు సుదీర్ఘ పోరాటం నిర్వహించి చివరకు సక్సెస్ అయ్యారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని తెలంగాణ హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది.
కోర్టు నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. టీచర్లకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించినా కోర్టు కేసులు అడ్డు వస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. పదోన్నతులు, బదిలీల కోసం ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి వస్తున్నా.. ఈ విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది.
బక్రీద్ సందర్భంగా జంతువధపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివకుమార్ లేఖను సుమోటోను ధర్మాసనం పిల్‌గా స్వీకరించించింది.
కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబరు 47పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది.
ప్-1 ప్రిలిమ్స్ (Group-1 Prelims) రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టు (High Court) విచారణ చేపట్టింది.
గ్రూప్-1 రద్దు కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలని ముగ్గురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకుండా, హాల్‌టికెట్ నెంబర్, ఫొటో లేకుండానే OMR షీట్ ఇచ్చారని ఆ ముగ్గురు పిటిషన్లో పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు.
చిన్నారుల అదృశ్యం, మానవ అక్రమ రవాణపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బాలల సంక్షేమ గృహాల్లో పరిస్థితులపై హైకోర్టుకు న్యాయ సేవాధికార సంస్థ నివేదిక అందజేసింది. రాష్ట్రంలో చైల్డ్ హోంలన్నీ ఎన్జీవోలే నిర్వహిస్తున్నాయని న్యాయసేవాధికార సంస్థ తెలిపింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న బాలల సంక్షేమ గృహాలు లేవని వెల్లడించింది. రాష్ట్రంలోని చైల్డ్ హోమ్‌లలో దయనీయ స్థితి ఉందని కోర్టుకు తెలియజేసింది.
టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆరుగురు సభ్యుల నియామకాలను
డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిప్లొమా కోర్సులను ఏఎఫ్ఆర్సీ పరిధిలోకి తేవాలని గతేడాది సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. సాంకేతిక విద్యా శాఖ ప్రతిపాదనలపై గతేడాది ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకో లేదు. కౌన్సెలింగ్ ప్రారంభమైనందున ఫీజులు పెంచాలని హైకోర్టులో ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు పిటిషన్ దాఖలు చేశాయి.