Home » Telangana High Court
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలన్న పిల్పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జగన్ కేసులప త్వరితగతిన విచారణ జరపాలని హరిరామ జోగయ్య పిల్ దాఖలు చేశారు.
Telangana: రాజేంద్రనగర్లో నూతన హైకోర్టు భవనానికి ఇప్పటికే సీజేఐ శంకుస్థాపన చేశారని.. కొత్త హైకోర్టు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే తెలిపారు. తెలంగాణ హైకోర్టులో 78వ స్వాతంత్ర్యదినోత్సవం ఘనంగా నిర్వహించారు.
వివేక హత్య కేసులో నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి.. సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా బెదిరింపులకు సైతం పాల్పడ్డాడని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. అదీకాక ఇదే హత్య కేసులో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయని సునీత తరుపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు.
కొత్త కోర్సులు ప్రారంభించే విషయమై ఇంజినీరింగ్ కాలేజీలు చేసుకున్న దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Telangana: కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. నిన్న (బుధవారం) జవహర్నగర్లో కుక్కల దాడిలో సంవత్సరంన్నర బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
Telangana: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతా పిటీషన్లపై ఈరోజు హైకోర్టులో విచారణ జరుగనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుపై పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యేల పిటిషన్లపై ఈరోజు హైకోర్టు విచారణ చేస్తుంది.
Andhrapradesh: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జగన్ కేసుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడ్ అప్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఎంపీ హరీరామజోగయ్య ఈ పిటిషన్ను వేశారు.
దేవాలయాలను వాణిజ్య దృక్కోణంలో నిర్వహించదరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొన్ని ఆలయాల నిర్వాహకులు, అధికారులు ఖర్చు ల పేరు చెప్పి ఆదాయమే పరమావధి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా తప్పుబట్టింది. ఆలయాల నిర్వహణ ప్రభుత్వాల బాధ్యత అని, కానీ వ్యయాలను రాబట్టుకోవాలనే పేరుతో వాటిని వాణిజ్య సంస్థల్లా తయారు చేస్తున్నారని ఆక్షేపించింది.
బక్రీద్ పండగ (Bakrid festival) సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు(Telangana High Court) ఆదేశించింది. ఈ మేరకు గోవులను తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.